సోషల్ మీడియాలో పార్టీల ఎన్నికల ఖర్చు

By narsimha lodeFirst Published May 22, 2019, 4:14 PM IST
Highlights

దేశంలో ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో  పలు రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్, గూగుల్ లలో రాజకీయ ప్రకటనల కోసం సుమారు రూ. 53 కోట్లను ఖర్చు చేశాయి. 
 

న్యూఢిల్లీ: దేశంలో ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో  పలు రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్, గూగుల్ లలో రాజకీయ ప్రకటనల కోసం సుమారు రూ. 53 కోట్లను ఖర్చు చేశాయి. 

ఫేస్‌బుక్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుండి మే 15వ తేదీ వరకు 1.21 లక్షల రాజకీయ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ అడ్వర్‌టైజ్ మెంట్ల కోసం రూ.26.5 కోట్లను ఖర్చు చేశారు.

ఫేస్‌బుక్ తో పాటు గూగుల్, యూట్యూబ్ లలో కూడ పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు తమ ప్రకటనల కోసం నిధులను ఖర్చు చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుండి  14,837 ప్రకటనల కోసం రూ. 27.36 కోట్లను ఖర్చు చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2,500 అడ్వర్‌టైజ్‌మెంట్ల కోసం ఫేస్‌బుక్ కు రూ. 4.23 కోట్లను ఖర్చు చేసింది. మై ఫస్ట్ ఫర్ మోడీ,  భారత్ కే మన్ కి బాత్, నేషన్ విత్ నమో టూ అనే ప్రకటనలను  బీజేపీ ఇచ్చింది.గూగుల్‌లో ప్రకటనల కోసం బీజేపీ రూ. 17 కోట్లు ఖర్చు చేసింది.

కాంగ్రెస్ పార్టీ ఫేస్‌బుక్‌లో ప్రకటనల కోసం రూ. 1.46  కోట్లను ఖర్చు చేసింది. ఫేస్‌బుక్ లో 3686 యాడ్స్ ఆ పార్టీ ఇచ్చింది.  గూగుల్ లో ప్రకటనల కోసం కాంగ్రెస్ పార్టీ రూ.2.71 కోట్లను ఖర్చు చేసి 425 యాడ్స్ ఇచ్చింది.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  ఫేస్ బుక్ కోసం రూ. 29.28 లక్షలను ఖర్చు చేసింది. ఆప్ ఫేస్ బుక్ లో యాడ్స్ కోసం రూ. 13.62 కోట్లను ఖర్చు చేసింది. గూగుల్‌లో యాడ్స్ కోసం రూ. 2.18 కోట్లను ఆప్ ఖర్చు చేసింది.కేవలం 176 ప్రకటనలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఫేస్ బుక్ లో ఇచ్చింది.

click me!