రాజకీయాల్లోకి కార్తీ భార్య శ్రీనిధి..?

By ramya NFirst Published Mar 6, 2019, 3:05 PM IST
Highlights

కార్తీ చిదంబరం భార్య డాక్టర్ శ్రీనిధి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా..?

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం కోడలు, కార్తీ చిదంబరం భార్య డాక్టర్ శ్రీనిధి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా..? ఆమె త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారా..? అవుననే సమాధానం ఇస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. 

గత ఎన్నికల్లో శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కార్తీ చిదంబరం ఓడిపోయారు. అయితే.. ఆ సమయంలో శ్రీనిధి భర్త తరపున సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. కానీ.. ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. వృత్తిరిత్యా శ్రీనిధి వైద్యురాలు. అంతేకాదు.. భారతనాట్య కళాకారిణి కూడా.

కాగా.. ఇప్పుడు శ్రీనిధిని భర్త  కార్తీ స్థానంలో  ఎన్నికల బరిలోకి దించాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పటికే శివమొగ్గ పార్లమెంటు స్థానం నుంచి చిదంబరం ఏడుసార్లు విజయం సాధించి కేంద్రమంత్రిగా పనిచేశారు. గత 2014 లోక్ సభ ఎన్నికల్లో తండ్రి స్థానంలో అతని కుమారుడు కార్తీ చిదంబరం పోటీ చేసినా 1,04,678 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 

శివమొగ్గ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో శ్రీనిధి పాల్గొని ప్రసంగించడంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. గతంలో భర్త వెనుక ఉండి వాట్సాప్ గ్రూప్ లో ప్రచారం చేసిన శ్రీనిధి మొట్టమొదటి సారి కార్యకర్తల ముందుకు వచ్చారు. శ్రీనిధి ఎన్నికల్లో పోటీ చేస్తే సగం ఉన్న మహిళా ఓట్లను కైవసం చేసుకోవచ్చని, దీనిద్వార సునాయాసంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ కార్యకర్తలంటున్నారు.

click me!