ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెసు: ఆప్ తో నో అలయెన్స్

By telugu teamFirst Published Mar 5, 2019, 2:42 PM IST
Highlights

ఢిల్లీలో ఏడు లోకసభ స్థానాలు ఉండగా, ఆరు స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెసుతో పొత్తుకు అవకాశం లేదని ఆయన అప్పుడే చెప్పేశారు. అయితే, పొత్తుకు అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేదు.

న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఉండదని తేల్చేసింది. రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఢిల్లీ కాంగ్రెసు చీఫ్ షీలా దీక్షిత్ ఆ విషయాన్ని మంగళవారంనాడు ప్రకటించారు. 

ఢిల్లీలో ఏడు లోకసభ స్థానాలు ఉండగా, ఆరు స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెసుతో పొత్తుకు అవకాశం లేదని ఆయన అప్పుడే చెప్పేశారు. అయితే, పొత్తుకు అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేదు. ఆప్ తో పొత్తును కాంగ్రెసు నేతలు ఏకగ్రీవంగా కొట్టిపారేశారని షీలా దీక్షిత్ చెప్పారు. 

రాహుల్ గాంధీతో మంగళవారంనాడు ఢిల్లీకి చెందిన కీలకమైన కాంగ్రెసు నేతలు సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశానికి షీలా దీక్షిత్ తో పాటు అజయ్ మాకెన్ కూడా పాల్గొన్నారు. 

ఢిల్లీలో కాంగ్రెసుకు రెండు సీట్లు ఇవ్వడానికి కేజ్రీవాల్ ముందుకు వచ్చారు. పంజాబ్ లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెసు మూడు సీట్లు కోరింది. ఒక వేళ కాంగ్రెసు ఢిల్లీలో ఎక్కువ సీట్లు కావాలనుకుంిటే, హర్యానా, పంజాబుల్లో తాము కోరుకున్నట్లు సీట్లు ఇవ్వాలని కేజ్రీవాల్ మెలిక పెట్టారు. ఈ స్థితిలో కాంగ్రెసు ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

click me!