కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్‌బబ్బర్‌కు బీఎస్పీ అభ్యర్ధి భగవాన్ బెదిరింపు

Published : Apr 16, 2019, 11:06 AM IST
కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్‌బబ్బర్‌కు బీఎస్పీ అభ్యర్ధి భగవాన్ బెదిరింపు

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుండి బీఎష్పీ  అభ్యర్థిగా పోటీ  చేస్తున్న భగవాన్ శర్మ అలియాస్ గుడ్డు పండిట్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ బబ్బర్‌తో పాటు అతని అనుచరులను బెదిరింపులకు పాల్పడ్డాడు

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ స్థానం నుండి బీఎష్పీ  అభ్యర్థిగా పోటీ  చేస్తున్న భగవాన్ శర్మ అలియాస్ గుడ్డు పండిట్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ బబ్బర్‌తో పాటు అతని అనుచరులను బెదిరింపులకు పాల్పడ్డాడు. 

ఎన్నికల్లో అసత్య ప్రచారం చేస్తే తాను కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్‌బబ్బర్‌తో పాటు మధ్య దళారులైన అతని మధ్య దళారులైన అతని మద్దతుదారులపై దాడి చేస్తానని భగవాన్ శర్మ హెచ్చరించారు. అంతేకాదు రాజ్‌బబ్బర్ మద్దతుదారులను ఆయన దూషించారు. 

రాజ్‌బబ్బర్ మద్దతుదారులారా వినండి... సమాజంలో అసత్య ప్రచారం చేస్తే మీకు, మీ నాయకులకు బూట్లతో తరిమి తరిమి కొడతాను... నేను ఈ పవిత్ర గంగపై ప్రమాణం చేసి చెబుతున్నానని ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.  

శర్మ గతంలో పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. పండిట్ శర్మపై ఇప్పటికే ఏడు క్రిమినల్ కేసులున్నాయి.  శర్మ 2007  ఎన్నికల్లో  దిబాయ్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

ఆమేథీలో ఓటమి బాటలో రాహుల్
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా: సాయంత్రం గవర్నర్ కు అందజేత