డీఎంకే నేతల ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు

By Siva KodatiFirst Published Apr 16, 2019, 10:16 AM IST
Highlights

ఎన్నికల వేళ తమిళనాడులో ఐటీ దాడులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా డీఎంకే నేతలే టార్గెట్‌గా సోదాలు జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఎన్నికల వేళ తమిళనాడులో ఐటీ దాడులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా డీఎంకే నేతలే టార్గెట్‌గా సోదాలు జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వెల్లూరులోని డీఎంకే కోశాధికారి దురైమురుగన్ కుమారుడు, ఎంపీ అభ్యర్థి కతిర్ ఆనంద్ ఇంట్లో రూ.10 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఆనంద్ సన్నిహితుడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించి రూ.11 కోట్లను పట్టుకున్నారు. సోమవారం చెన్నైలోని ఎమ్మెల్యేకు చెందిన హాస్టల్‌పై ఆదాయపు పన్ను శాఖ, ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేసి ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన డబ్బును దాడి స్వాధీనం చేసుకున్నారు.

అలాగే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్భీ ఉధ్యాయ కుమార్‌తో పాటు మరో ఇద్దరు శాసనసభ్యుల ఇళ్లపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. 

click me!