
కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మంగళవారంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మాండ్య, హసన్‌లలో ఏకకాలంలో ఐటీ శాఖ సోదాలకు నిర్వహిస్తోంది.
నేతల ఇళ్లే టార్గెట్‌గా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.