రాయపాటికి షాక్: కోడెలను ముందుకు తెచ్చిన చంద్రబాబు

Published : Mar 11, 2019, 12:37 PM IST
రాయపాటికి షాక్: కోడెలను ముందుకు తెచ్చిన చంద్రబాబు

సారాంశం

నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి స్పీకర్ కోడెల శివప్రసాదరావు‌ను పోటీకి దింపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు కోడెల సుముఖంగా లేరు.

అమరావతి: నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి స్పీకర్ కోడెల శివప్రసాదరావు‌ను పోటీకి దింపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు కోడెల సుముఖంగా లేరు.  సోమవారం నాడు చంద్రబాబునాయుడు నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి చెందిన నేతలతో సమావేశం కానున్నారు.

నర్సరావుపేట  ఎంపీ స్థానం నుండి పోటీకి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు సిద్దంగా ఉన్నారు. కానీ, రాయపాటి ఆరోగ్య కారణాల రీత్యా ఆయన బదులుగా మరోకరిని ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.

నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి  పోటీ చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును చంద్రబాబునాయుడు కోరారు. అయితే ఎంపీ స్థానం నుండి పోటీకి కోడెల విముఖత చూపుతున్నారు.

తాను నర్సరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తానని కోడెల స్పష్టం చేశారు.  నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని తనకు కేటాయించకపోతే తన కొడుకు రంగబాబు సత్తెనపల్లి టిక్కెట్టు ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు కోరుతున్నారు.

నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి  పోటీ చేసే అభ్యర్ధిని సోమవారం నాడు చంద్రబాబునాయుడు ఫైనల్ చేసే అవకాశం ఉంది.  ఇవాళ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

రాంపూర్ లో ఓటమి: జయప్రద సంచలన వ్యాఖ్యలు
దిగ్విజయ్ విక్టరీకి హఠయోగం: ఎవరీ కంప్యూటర్ బాబా?