
చిలిపితనం, అల్లరి, ముద్దుమాటలు, క్యూట్ నెస్ కలిస్తే ముద్దులొలికే చిన్నారులు. వీరి అల్లరి ఎంత ముద్దుగా ఉంటుందో.. అంత భరించలేకుండా ఉంటుంది. వారితో డీల్ చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి.
చిన్నారులకు చూసిన ప్రతీదీ ముట్టుకుని చూడాలని ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీనివల్ల anxiety ఫీలవుతారు. confusion అవుతారు. వీరికి motivation అవసరం ఉంటుంది. అలా లేకపోతే సతాయిస్తుంటారు.
ఈ anxiousness వల్ల ఇతర సమస్యలు కూడా వస్తుంది. ఏంటో తెలుసుకోవాలి, ఏదో చేయాలన్న ఆతృత వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. తినడం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. దీంతో జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది.
ఇది రెండు మూడేళ్ల పిల్లలనుంచి స్కూలుకు వెడుతున్న పిల్లలవరకూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే స్కూల్స్ లో చిన్నారుల మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది.
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ వేగవంతం అవ్వడంతో స్కూల్స్ తిరిగి తెరుచుకోనున్నాయి. చాలాచోట్ల ఇప్పటికే స్కూల్స్ తెరిచారు కూడా. దీంతో covid -19 నేపథ్యం వల్ల చిన్నారుల మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా తద్వారా వారి ప్రవర్తనలో మార్పు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి సందర్భాల్లో యోగా చిన్నారులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. yoga వల్ల వారికి మానసిక ప్రశాంతతతో పాటు రోజువారీ లైప్ స్టైల్ బాగుండేలా ప్రోత్సహిస్తుంది. అలాంటి ఐదు యోగాసనాలు ఇవి.
లోటస్ పోస్
lotus pose తేలికగా ఎవరైనా చేయగలిగే యోగాసనం ఇది. దీనికి మీ చిన్నారులను ప్రోత్సహించండి. దీనివల్ల వారిని ఆందోళన నుంచి దూరం చేయడమే కాకుండా వారి మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చురుకుదనం పెంచుతుంది. శారీరక సమస్యల బారిన పడకుండా చూస్తుంది.
చైల్డ్స్ పోస్
మిగతా ఆసనాల మధ్యలో రెస్ట్ కోసం వేసే child pose చాలా సులువైన యోగా ఆసనం. ఇది చిన్నపిల్లలు వేయడం వల్ల వారిని కామ్ గా, శరీరాన్ని స్ట్రెచ్ చేయడానికి, శరీరంలో శక్తిని రిస్టోర్ చేయడానికి తోడ్పడుతుంది.
బద్దకోణాసనం
దీన్నే ant pose అని కూడా అంటారు. ఈ ఆసనం వల్ల పిల్లల్లో కలిగే రకరకాల ఎమోషన్స్ ను తగ్గించడానికి వారిని ప్రశాంతంగా ఉంచడానికి.. నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడానికి తోడ్పడుతుంది.
వజ్రాసనం
vajrasana వల్ల జీర్ణక్రియ బాగుపడుతుంది. ధ్యానానికి సంబంధించిన ఆసనాల్లో ఇదీ ఒకటి. జీర్ణక్రియ సరిగాలేని చిన్నారులకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అసిడిటీ, అల్సర్ లాంటి వాటికి చెక్ పెట్టి.. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
కోబ్రా పోస్
కాటే వేయడానికి తలెత్తే పాములా ఒంటిని ఒంచే పోస్. అందుకే దీన్ని cobra pose అంటారు. దీనివల్ల శరీరానికి చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి.