పొడవాటి.. అందమైన జుట్టుకోసం.. అద్భుతమైన నూనె..

By AN TeluguFirst Published Oct 22, 2021, 1:47 PM IST
Highlights

అందమైన, ఒత్తైన జుట్టుకోసం home remediesతో మొదలుపెట్టి ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, రెమెడీస్, సహజపద్ధతులు పాటిస్తుంటారు. అయితే జుట్టు ఒక్కసారి ఊడిపోవడం మొదలుపెడితే దాన్ని ఆపడం సాధ్యం కాదు. పోయిన జుట్టును తిరిగి రప్పించడమూ అంతే అసాధ్యమైన విషయం. 

పొడవాటి అందమైన జుట్టు కావాలని ఎవరైనా కోరుకుంటారు. చివర్లు చిట్లకుండా, డ్రైగా ఉండకుండా, ఊడిపోకుండా.. హెల్తీగా, పొడవైన జుట్టును ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

అందమైన, ఒత్తైన జుట్టుకోసం home remediesతో మొదలుపెట్టి ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, రెమెడీస్, సహజపద్ధతులు పాటిస్తుంటారు. అయితే జుట్టు ఒక్కసారి ఊడిపోవడం మొదలుపెడితే దాన్ని ఆపడం సాధ్యం కాదు. పోయిన జుట్టును తిరిగి రప్పించడమూ అంతే అసాధ్యమైన విషయం. 

జుట్టు ఊడిపోవడానికి పెరగకుండా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిల్లో జన్యూపరమైన లక్షణాలతో పాటు వాతావరణంమార్పులు, కాలుష్యం, ఒత్తిడి ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటన్నింటినీ తట్టుకుని మీ జుట్టును బలంగా, దృఢంగా, పొడవుగా పెరిగేలా చేసే ఓ చిట్కా ఉంది. 

దీనికోసం మీరు చేయాల్సిందల్లా జుట్టు సంరక్షణను జాగ్రత్తగా చూసుకోవడం, జుట్టుకు చక్కటి నూనె ను వాడడం. ఇలాంటి ఓ అద్భుతమైన ఆయిల్ ను మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 

దీనికోసం కావాల్సిన పదార్థాలు.. 200ml coconut oil, 100ఎం.ఎల్. ఆలివ్ ఆయిల్, 50 ml almond oil, 30ml castrol oil, ఐదు మందార ఆకులు, 30ml తాజా ఉసిరికాయ రసం, 20 వేప ఆకులు.

ఇప్పుడు ఈ neem leaves, amla juice, olive oil, hibiscus leaves, కొబ్బరినూనె, కాస్ట్రాల్ ఆయిల్..అన్నింటిని కలిపి ఒక పాన్ లోకి తీసుకుని వేడి చేయాలి. పది నిమిషాల పాటు నూనెను బాగా వేడిచేసి మంట ఆర్పేయాలి. 

ఆ తరువాత నూనె చల్లబడ్డాక, వడకట్టి శుభ్రమైన గాజు సీసాలోకి నూనెను తీసుకోవాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా తలకు పెట్టుకుంటుంటే కొద్ది రోజుల్లో ఫలితాన్ని గమనించవచ్చు. 

దీంతోపాటు..జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్, అమ్మోనియా అధికంగా ఉంటుంది. ఉల్లిపాయ గుజ్జులోcoconut oil కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ ను తలకు బాగా రాసి మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయాలి.

కరివేపాకు  జుట్టు రాలుటను తగ్గిస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోని ఇందులో కొన్ని కరివేపాకులను వేసి నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నూనెను (heat oil) వడగట్టాలి. ఈ నూనెతో వారానికి రెండు మూడుసార్లు తలకు మర్దన చేసుకుని 45 నిమిషాల తర్వాత గాఢతలేని షాంపూతో తలస్నానం చేయాలి. 

aloevera జుట్టును ఒత్తుగా చేయుటకు బలంగా చేయుటకు కావలసిన పోషకాలను కలిగి ఉంటుంది. కలబంద గుజ్జును తలకు మర్దన చేసుకుని 20 నిమిషాల తర్వాత shampoo తో తలస్నానం చేయాలి. ఇలా చేయుట వలన జుట్టు బలంగా ఒత్తుగా ప్రకాశవంతంగా మారుతుంది.      
 
గుడ్లలో ప్రోటీన్, సల్ఫర్, జింక్, ఐరన్, అయోడిన్ మరియు భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. దీని ద్వారా ఇచ్చే ప్రోటీన్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. పచ్చి గుడ్డును తలకు రాసుకుని 20 నిమిషాల ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో  తలస్నానం చేయడం వల్ల ప్రకాశవంతంగా ఉంటుంది.

చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేసి చూడండి!
 

click me!