భర్త అందంగా లేడని..పిల్లల కోసం...

By ramya neerukonda  |  First Published Jan 26, 2019, 2:59 PM IST

భర్త అందంగా లేడని ఓ వివాహిత చేసిన పని విస్మయానికి గురి చేసింది. అందంగా లేని భర్తతో కాపురం చేస్తే.. పుట్టే పిల్లలు కూడా అతని లాగానే అందవిహీనంగా పుడతారని భావించింది. 



భర్త అందంగా లేడని ఓ వివాహిత చేసిన పని విస్మయానికి గురి చేసింది. అందంగా లేని భర్తతో కాపురం చేస్తే.. పుట్టే పిల్లలు కూడా అతని లాగానే అందవిహీనంగా పుడతారని భావించింది. అందుకే.. అందమైన పిల్లల్ని కనడానికి మరో మార్గాన్ని ఎంచుకుంది. అందమైన స్పెర్మ్ డోనర్ కోసం వెతుకుతూ.. ఓ డాక్టర్ తో ప్రేమలో పడింది.

భర్తను దూరం పెట్టేసి.. ఆ డాక్టర్ తో సహజీవనం చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న భర్త.. సోషల్ మీడియా ద్వారా తన బాధనంతటినీ వెళ్లగక్కాడు. ‘‘ పిల్లల కోసం ప్లాన్ చేసుకుందాం అని నేను నా భార్యతో  అంటే.. నువ్వు అందంగా లేవు..నీతో పిల్లల్ని కంటే పిల్లలు కూడా నీలానే పుడతారు అని నా భార్య అంటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Latest Videos

హ్యాండ్సమ్‌గా, స్మార్ట్‌గా ఉన్న వేరే వ్యక్తి వీర్యంతో పిల్లల్ని కంటే.. వాళ్ల భవిష్యత్తు బాగుంటుందట. నీ బదులు మరో మహిళ అండంతో పిల్లల్ని కందామంటే.. అందుకు ఒప్పుకోవడం లేదు. మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆ బిడ్డతో రక్త సంబంధం ఉండాలని అంటోంద’ని అమెరికాకు చెందిన ఆ భర్త వాపోయాడు. 

‘ఆమె ఇప్పటికే పెళ్లయిన ఓ డాక్టర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. రాత్రి పూట చాలాసార్లు అతడు డిన్నర్ చేయడానికి మా ఇంటికొచ్చి వెళ్ళాడు. అతడిలాగే తనకు పుట్టబోయే పిల్లలు ఉండాలని కోరుకుంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆమె డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. హ్యాండ్సమ్‌గా ఉన్న వ్యక్తితో కలిసి పిల్లల్ని కని.. వారిని పెంచడానికి నా డబ్బును వాడుకోవాలని భావిస్తోంది’ అంటూ ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. అంతేకాదు.. తన భార్యకి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అతను వివరించాడు. 

click me!