సెక్స్ తో శరీరంలోకి బ్యాక్టీరియా.. ప్రాణాలకే ముప్పు

By ramya N  |  First Published Feb 12, 2019, 2:52 PM IST

లిప్ లాక్ లు, ఓరల్ సెక్స్ చేయడం ద్వారా బ్యాక్టీరియా తమ పార్ట్ నర్స్ లోనికి కూడా ఆ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.



సెక్స్ ద్వారా మనిషికి వచ్చే జబ్బు ఎయిడ్స్ ఒక్కటే అని చాలా మంది భావిస్తుంటారు. అవికాకుండా.. చాలా ప్రాణాంతక వ్యాధులు రావడానికి  సెక్స్ కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. శృంగారం చేయడం ద్వారా శరీరంలోని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ప్రవేశించి.. ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయని ఓ సర్వేలో తేలింది. మర

వయసు పెరిగిన వారిలో  దాదాపు 5నుంచి 10 శాతం మందిలో ముక్కు, గొంతు వెనుక భాగంలో నైస్సీరియా మెనింజిటిడిస్ అనే బ్యాక్టీరియా ఉంటుందట. ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్నవారు లిప్ లాక్ లు, ఓరల్ సెక్స్ చేయడం ద్వారా బ్యాక్టీరియా తమ పార్ట్ నర్స్ లోనికి కూడా ఆ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.

Latest Videos

దాదాపు 2శాతం మందిలో మైకోప్లాస్మా జెనిటేలియమ్ అనే వైరస్ ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్, యువతలో ఈ వైరస్ ఎక్కువగా సోకుతుంది. ఈ వైరస్ ఉన్నవారితో సెక్స్ చేస్తే ఎదుటి వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ బ్యాక్టీరియా సోకితే.. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కండోమ్ వాడకంతో దీని నివారించవచ్చు.

యువతీయువకుల ఇద్దరి ముఖాలు ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు షిగెల్లోసిన్ అనే బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందట. బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ మొదలై.. తీవ్రమైన కడుపునొప్పితోపాటు చీము-రక్తంతో విరేచనాలు కలిగి, ఈ బ్యాక్టీరియా మరింత ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.

తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లోని చిన్నపిల్లలు, ప్రయాణాలు చేసేవారిలో ఈ వ్యాధి సాధారణమే. కానీ 1970లో అధ్యయనకారులు షిగెల్లోసిస్‌ను స్వలింగ సంపర్కులు, బైసెక్సువల్స్‌లో కూడా గుర్తించారు. యానల్ సెక్స్, ఓరల్ సెక్స్ ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని తేలింది. 

click me!