రమ్‌ తాగితే శరీరం ఎందుకు వేడెక్కుతుంది? దీనికి వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే..

By Narender Vaitla  |  First Published Jan 2, 2025, 5:20 PM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయినా మద్యం ప్రియులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. రకరకాల కారణాలు చెబుతూ మద్యం సేవిస్తుంటారు. ఇక మద్యానికి సంబంధించి ఎన్నో అపోహలు ఉంటాయి. అయితే వీటిలో కొన్ని నిజాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, గెలిచినా, ఓడినా.. ఆల్కహాల్ ఉండాల్సిందే. అందరూ కాకపోయినా కొందరికి ఈ అలవాటు కచ్చితంగా ఉంటుంది. ఇక మద్యం ప్రియులు తాము తాగే దానికి ఒక జస్టిఫికేషన్‌ కూడా ఇచ్చుకుంటారు. రోజూ ఒక పెగ్‌ తాగితే ఏం కాదంటూ సమర్థించుకుంటారు. అయితే వీటిలో అస్సలు నిజం ఉండదని నిపుణులు చెబుతూనే ఉంటారు. మద్యపానం ఆరోగ్యానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. రోజుకు ఒక్క పెగ్గు వేసినా ప్రమాదకరమేనని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో తేలింది. 

ఇదిలా ఉంటే చలికాలం చాలా మంది మద్యం ప్రియులు రమ్‌ను తీసుకుంటుంటారు. రమ్‌ శరీరాన్ని వేడిగా మారుస్తుందని చెబుతుంటారు. షిప్స్‌లో ఎక్కువ కాలం ప్రయాణించే వారు కూడా ఆ చలి వాతవరణాన్ని తట్టుకునేందుకు రమ్‌ తీసుకుంటారని అంటుంటారు. ఇంతకీ నిజంగానే రమ్‌ శరీరాన్ని వేడిగా ఉంచుతుందా.? అసలు రమ్‌ తాగితే శరీరం ఎందుకు వేడెక్కుతుంది.? రమ్‌ను ఎలా తయారు చేస్తారు లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Latest Videos

రమ్‌ను ఎలా తయారు చేస్తారు? 

ఆల్కహాల్‌లో ఒకరమైన రమ్‌ను తయారు చేయడానికి మొలాసిస్‌ను ఉపయోగిస్తుంటారు. చెరుకు రసం నుంచి చక్కెరను తయారు చేసే సమయంలో ఈ మొలాసిస్‌ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. చక్కెర తయారీ సమయంలో ఉత్పత్తి అయ్యే మొలాసిస్‌ ముదురు రంగులో ఉంటుంది. ఇలా వచ్చిన మొలాసిస్‌ను పులియెట్టడం ద్వారా రమ్‌ను తయారు చేస్తారు. ముఖ్యంగా రమ్‌లో రెండు రకాలు ఉంటాయి. వీటిలో ఒకటి డార్క్‌ రమ్‌ కాగా మరొకటి లైట్‌ రమ్‌. 

రంగులో తేడా ఎందుకు? 

రమ్‌ తయారీ ప్రక్రియ ఒకేలా ఉన్నా మెలాసిస్‌  కారణంగానే రంగులో వ్యత్యాసం ఉంటుంది. డార్క్‌ రమ్‌ తయారు చేసే సమయంలో పూర్తయిన మొలాసిస్‌ను విడిగా కలుపుతారు. లైట్‌ రమ్‌లో ఈ విధానం ఉండదు. అందుకే లైట్‌ రమ్‌ పాదర్శకంగా ఉంటుంది. వీటినే వోడ్కాగా చెబుతుంటారు. డార్క్‌ రమ్‌ కలర్‌ ఉంటుంది. రమ్‌ కాలర్‌లో మార్పులకు ప్రధాన కారణం ఇదేనని చెప్పాలి. ఇక రుచిలోనూ మార్పు ఉండడానికి మొలాసిస్‌ కలిపే విధానమే కారణంగా చెబుతుంటారు. 

రమ్‌ తాగితే వేడిగా ఎందుకు? 

డర్క్‌ రమ్‌ను సేవిస్తే శరీరం వేడెక్కుతుందనడంలో నిజం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా డర్క్‌ రమ్‌ తయారీలో మొలాసిస్‌ను విడిగా యాడ్‌ చేస్తుంటారు. ఈ ప్రక్రియ వల్లే రమ్‌ ముదురు రంగులోకి మారుతుంది. ఇలా మొలాసిస్‌ను అధికంగా జోడించడం వల్ల రమ్‌లో ఎక్కువ కేలరీలు అవుతాయి. దీని కారణంగానే రమ్‌ తాగితే శరీరం వేడెక్కిన భావన కలుగుతుంది. ఒక్కసారిగా శరీరంలో కేలరీలు ఎక్కువగా చేరడం వల్ల శరీరంలో జీవక్రియ వేగం పెరుగుతుంది. దీని కారణంగానే శరీరం వేడిగా మారుతుందని చెబుతుంటారు. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్న దానిపై నిర్ధిష్టమైన స్పష్టత లేదని రీడర్స్‌ గమనించాలి. 
 

click me!