స్మోకింగ్ మానేశాక బరువు పెరుగుతున్నారా? ఎందుకో తెలుసా?

By AN TeluguFirst Published Oct 14, 2021, 12:10 PM IST
Highlights

పొగత్రాగటం మానేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు బరువు పెరగడం సాధారణ విషయం. సిగరెట్ మానేయడం వల్ల ఒంటరితనం ఫీలవుతారు. దీంతో మళ్లీ దాన్నిమొదలెట్టాలనిపిస్తుంది. పొగత్రాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ధూమపానం అనేది ఒక వ్యసనం, ఇది కాలక్రమేణా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. కానీ ధూమపానం మానేయడం కూడా అంత తేలికైన పని కాదు. smoking మానేయడానికి ప్రయత్నించే వారు తరచుగా అవాంఛిత దుష్ప్రభావాలను ఎదుర్కొంటారు. nicotine కు అలవాటు పడ్డాక, దానిమీద డిపెండ్ అవుతారు. అందుకే అది మానకోవడం మరింత సవాలుగా మారుతుంది.

పొగత్రాగటం మానేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు బరువు పెరగడం సాధారణ విషయం. సిగరెట్ మానేయడం వల్ల ఒంటరితనం ఫీలవుతారు. దీంతో మళ్లీ దాన్నిమొదలెట్టాలనిపిస్తుంది. పొగత్రాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ధూమపానం మానేసిన తర్వాత కలిగే బరువు పెరగడం ఇప్పటికీ రివర్సిబుల్. కానీ దాని వల్ల కలిగే ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పోలిస్తే ఇదేమంతా  ప్రాణాంతకమైనది కాదు. 

పొగత్రాగడం మానేసిన తర్వాత ఎందుకు బరువు పెరుగుతారు?
డ్రగ్ అండ్ ఆల్కహాల్ డిపెండెన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం పొగత్రాగడం మానేసిన తరువాత మెడదు దాన్ని అంగీకరించదు. అందుకే బరువు పెరిగే విషయంలో real culprit మన మెదడే. నికోటిన్ మానేయడం వల్ల మెదడు అనేక అనారోగ్యకరమైన, ప్రాసెస్ చేయబడిన ఆహారం తినాలనే కోరికను పెంచుతుంది. దీనికి తోడు, సిగరెట్లు ఆకలిని తగ్గిస్తాయి. కాబట్టి, మీరు cigarettes మానేసినప్పుడు, ఆకలిగా అనిపిస్తుంది. మామూలు కంటే ఎక్కువ తింటారు. 

ఈ అన్ని కారణాల వల్ల సిగరెట్స్ మానేయడానికి ప్రయత్నించినప్పుడు బరువు పెరిగేలా చేస్తాయి. సిగరెట్స్ మానేసాక బరువు పెరగడానికి మరొక కారణం నికోటిన్ లేనప్పుడు జీవక్రియ మందగిస్తుంది. దీనివల్ల స్మోకింగ్ కు అలవాటు పడిన వ్యక్తి, అది మానేసినప్పుడు తక్కువ కేలరీలు కరిగించగలుగుతారు. 

మరి సిగరెట్లు మానేసినాక బరువు తగ్గడం ఎలా ??

నికోటిన్ మానేసిన తర్వాత బరువు పెరగడం మామూలే. అందుకే మీరు ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మొదటి నుండి healthy weightను మెయింటేన్ చేసేలా చర్యలు తీసుకోవడం మంచిది. దీనివల్ల మొదట బరువు పెరగడం, తరువాత తగ్గడం వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. దీనికోసం ఏం చేయాలో చూడండి.. 

యాక్టివ్‌గా ఉండండి :  మీరు శారీరక వ్యాయామాలు చేస్తూ చురుకుగా ఉంటే, మీ Exercising దినచర్యను కొనసాగించండి. ఒకవేళ ఇప్పటివరకు ఎలాంటి వ్యాయామాలు చేయకపోతే.. వెంటనే మొదలుపెట్టండి. వ్యాయామం చేయడం వల్ల మీ metabolism పెరుగుతుంది.  మీరు మామూలు కంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మీ workout routineలో కార్డియో,  strength training సెషన్‌లను చేర్చండి. రోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయండి.

ఆహారంలో ఎక్కువ ఫైబర్ : ఫైబర్ కడుపును ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. fiber అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం  వలన కొవ్వు, చక్కెరలలాంటివి తినాలనే cravings కు దూరంగా ఉండొచ్చు. బరువు తగ్గడానికి, మెయింటేన్ చేయడానికి అనేక రంగురంగుల కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తినాలి. దీనికోసం శుభ్రమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

బాగా ఆకలి అయ్యేవరకు వేచి ఉండకండి.. 

తినడానికి eating schedule పెట్టుకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ దానికే కట్టుబడి ఉండండి. అలాగని ఒక భోజనానికి మరో భోజనానికి మధ్య అంతరం ఎక్కువ ఉండకూడదు. ఇది మిమ్మల్ని ఆకలితో ఉంచుతుంది. దీనివల్ల భోజన సమయంలో ఎక్కువ తింటారు. అందుకే క్రమమైన వ్యవధిలో తినండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. అందులో అన్నీసూక్ష్మ, స్థూల పోషకాలు ఉండేలా సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.

సమయానికి నిద్రపోండి
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు sleeping schedule కూడా చాలా ముఖ్యం. నిద్రలేమి లేదా తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల ఉదయాన్నే అనారోగ్యకరమైన ఆహారాలు తినాలనే కోరిక పెరుగుతుంది. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకు, ఏకాగ్రత లేకపోవటానికి కూడా దారితీస్తుంది.

ఈ ఆయుర్వేదా మూలికలతో ఆరోగ్యమైన గుండె.. అవేంటంటే?

click me!