పొట్ట ఎలా తగ్గించుకోవాలి అనే సమస్యను పక్కన పెడితే.. ఉన్న పొట్టను కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.
పొట్ట.. ఇది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఎంత తక్కువ తిన్నా కూడా పొట్ట వచ్చేస్తుందనే బాధపడే వారు చాలా మంది ఉన్నారు. పొట్ట ఎలా తగ్గించుకోవాలి అనే సమస్యను పక్కన పెడితే.. ఉన్న పొట్టను కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.
కొందరు సన్నగా ఉన్నప్పటికీ చేతులు లావుగా, పొట్ట కనపడుతూ ఉంటాయి. అలాంటి వాళ్లు.. స్లీవ్ లెస్, సెమీ స్లీవ్ లెస్, షార్ట్ స్లీవ్స్ వేసుకోకూడదు. మోచేతివరకూ చేతులు కుట్టించుకుని కోల్డ్‌షోల్డర్ స్లీవ్స్ పెట్టించుకుంటే బాగుంటాయి. ఫుల్‌హ్యాండ్స్, హాఫ్‌హ్యాండ్స్ ఫోల్డ్ డిజైన్‌లో ప్రయత్నించొచ్చు.
ఇక మొయిన్ ప్రాబ్లం పొట్ట విషయానికి వస్తే.. మరీ ఒంటికి అతుక్కునే రకాల్ని కాకుండా ఒకటీ రెండు అంగుళాలు వదులుగా ఉండే టాప్‌లను ఎంచుకోవాలి. ముఖ్యంగా కుర్తాలయితే ఫ్రాక్, కలీ, అనార్కలీ, పెప్లమ్ వంటి డిజైన్లు ఎంచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. చీరలు కట్టుకోవాలనుకుంటే... కాటన్ కాకుండా జార్జెట్, షిఫాన్, క్రేప్ రకాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.