Kitchen Tips: కుక్కర్‌ లో వండిన అన్నం రుచిగా ఉంటుందా లేక ఓపెన్ పాన్ లో వండిన అన్నమా...!

Published : Jun 12, 2025, 01:22 PM IST
pressure cooker

సారాంశం

అన్నం వండడానికి చాలా మంది ఇప్పటికీ పాత పద్దతులు వాడుతుంటారు. కొందరు మాత్రం ప్రెజర్‌ కుక్కర్‌ ని ఉపయోగిస్తుంటారు. వీటిలో ఏది సరైన పద్దతి అని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వంట చేయడం పెద్ద సవాలే. టైమ్‌ ఆదా చేసుకోవడానికి చాలా మంది కరెంట్‌ కుక్కర్లు, ప్రెజర్‌ కుక్కర్లు ఉపయోగిస్తుంటారు. దాని వల్ల అన్నం ఉడకడం త్వరగా అవుతుంది. ఆ టైమ్‌ లో వేరే పని చేసుకోవడానికి కూడా వీలుంటుంది.కానీ కరెంట్‌ మీద అన్నం వండడం వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుండడంతో వాటి వాడకం కాస్త తగ్గించారు. కానీ చాలా మంది కరెంట్‌ కుక్కర్‌ కి ప్రత్యామ్నాయంగా ప్రెజర్‌ కుక్కర్‌ వాడుతుంటారు.కొంతమంది మాత్రం ఇంకా పాతకాలపు పద్దతులనే ఉపయోగించి అన్నం వార్చి వండుతుంటారు.

ప్రెజర్ కుక్కరా..ఓపెన్ పానా..

చాలామందికి ఈ రెండిటిలో ఏది సరైన విధానం అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం.ప్రెజర్‌ కుక్కర్లో వండడం వల్ల అన్నం కేవలం రెండు మూడు విజిల్స్‌ కే ఉడికిపోతుంది. కానీ దీనిలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రెజర్‌ కుక్కర్లో నీరు ఎక్కువైనా,తక్కువ అయినా అన్నం సరిగా రాదు.దాంతో తినడానికి పనికిరాదు. పైగా అన్నానికి ఉండే సహజమైన రుచి,సువాసన కూడా తగ్గుతుంది.

మంచి సువాసన, రుచి…

పాత్రలో అన్నం వండితే సమయం ఎక్కువ పడుతోంది కానీ...మంచి సువాసన రుచి ఉంటాయి.ఈ పద్ధతిలో బియ్యానికి నీటికి కొంత ఎక్కువగా వేసి తక్కువ మంటపై నెమ్మదిగా ఉడకబెట్టాలి. దీనివల్ల అన్నం ప్రతి మెతుకు విడిగా ఉండి, ముద్దలా అయిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా మంచి సన్న బియ్యం, బాస్మతి బియ్యం వంటివి వండితే మాత్రం పాన్ లో వండడమే మంచిది.

చిన్నచిన్న చిట్కాలు…

రుచి కోసం కొంతమంది పాన్ లో వండేటప్పుడు లవంగాలు, నిమ్మరసం వంటి చిన్నచిన్న చిట్కాలు వాడుతుంటారు.ఇవి అన్నానికి అదనపు రుచిని , సువాసనను ఇస్తాయి.మొత్తంగా చూసుకుంటే, వేగంగాఅయిపోవాలంటే మాత్రం ప్రెజర్‌ కుక్కర్ సరైన ఎంపిక. రుచి కోసం అయితే మాత్రం పాన్ వంటకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాత్రిపూట అస్సలు తినకూడని పండ్లు ఇవే!
ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గడం ఈజీ