టూత్ పేస్టుతో మహిళల్లో అబార్షన్..?

By ramya neerukonda  |  First Published Aug 18, 2018, 12:03 PM IST

మనం వాడే టూత్ పేస్టుతో మహిళల్లో అబార్షన్ లు జరిగే అవకాశం ఉందట. అంతేకాదు.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు.


ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కంపెనీ టూత్ పేస్టుతో బ్రష్ చేయడం సహజం. కానీ మనం రోజు ఏపయోగించే ఈ టూత్ పేస్ట్ ఎంత మేర మనకు హానికరంగా మారుతుందో ఎవరూ ఉహించలేరు. ఎందుకంటే.. మనం వాడే టూత్ పేస్టుతో మహిళల్లో అబార్షన్ లు జరిగే అవకాశం ఉందట. అంతేకాదు.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు.

మీరు చదివింది నిజమే. కేవలం టూత్ పేస్టుల్లోనే కాదు... కొన్ని రకాల సోప్స్  కూడా క్యాన్సర్ రావడానికి కారణమౌతాయంటున్నారు నిపుణులు. వీటిల్లో ట్రైక్లోసన్ అనే పదార్థం ఉంటుందట. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రైక్లోసన్ పదార్థం సాధారణంగా బ్యాక్టీరియా ని అంతమొందించేందుకు ఉపయోగపడుతుంది.

Latest Videos

undefined

అందుకే.. టూత్ పేస్టుల్లో, సబ్బుల్లో వినియోగిస్తుంటారు. అయితే.. ఇది కొద్దికొద్దిగా కడుపులోకి వెళ్లి.. మన శరీరంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కూడా అంతమొందిస్తోంది. తద్వారా ఈ సమస్యలు తలెత్తున్నాయని నిపుణుల వాదన. కొన్ని దేశాల్లో ఈ ట్రైక్లోసన్ పదార్థంతో తయారు చేసే సబ్బులు, పేస్టులపై నిషేధం ఉంది. కానీ.. మనదేశంలో ఇలాంటి నిషేధం లేదు.

 

read more news..

భర్తకి ఎఫైర్ ఉందని భార్యకి ముందే తెలిస్తే..? ఓ పాఠకురాలి అనుభవం

మహిళల్లో ఆలస్యంగా భావప్రాప్తి.. ఎందుకంత అనుమానం..?

ఫస్ట్ టైమ్ సెక్స్... అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా?

click me!