రోజూ వ్యాయామం చేయకపోతే.. శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయంటే..

By AN TeluguFirst Published Oct 25, 2021, 3:06 PM IST
Highlights

చాలామంది రోజువారీ వ్యాయామానికి చాలా దూరంగా ఉంటున్నారు. మరి అస్సలు వ్యాయామం చేయకపోతే మీ శరీరానికి ఏం జరుగుతుంది? లేదా ఎక్కువ రోజుల పాటు exercise చేయకుండా ఉండడం వల్ల ఎలాంటి నష్టాలుంటాయి? 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి, తీరైన ఆకృతికి, అన్ని అవయవాలూ చురుగ్గా పనిచేయడానికి  సహాయపడుతుంది. అందుకే ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి క్రమం తప్పకుండా 45-50 నిమిషాలవరకు moderate intensity exercise చేయాలని చెబుతారు. 

అయితే, దీన్ని ఎంతమంది ఫాలో అవుతారు అంటే అది ప్రశ్నార్థకమే. ఆరోగ్యం మీద వ్యాయామం మీద శ్రద్ధ పెరిగినప్పటికీ.. ఇప్పటికీ చాలామంది రోజువారీ వ్యాయామానికి చాలా దూరంగా ఉంటున్నారు. మరి అస్సలు వ్యాయామం చేయకపోతే మీ శరీరానికి ఏం జరుగుతుంది? లేదా ఎక్కువ రోజుల పాటు exercise చేయకుండా ఉండడం వల్ల ఎలాంటి నష్టాలుంటాయి? 

శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల కలిగే.. హానికరమైన ప్రభావాలు..

మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ లాంటివి శరీరానికి హానికరం అని ఈజీగా ఒప్పుకుంటాం. అలాంటి ప్రభావమే వ్యాయామం లేకుండా కండరాలు చురుకుగా లేకపోవడం వల్ల కలుగుతుందన్న విషయం గుర్తించం. 

ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, క్రమం తప్పకుండా, చురుకైన వ్యాయామం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుందని చెబుతోంది. శారీరక శ్రమ అవసరమైన స్థాయిలను అందుకోకపోవడం మీ అకాల మరణ ప్రమాదాన్ని వేగవంతం చేస్తుంది.  

శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కంటే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. వారానికి ఒకట్రెండు రోజులు వ్యాయామం చేయకపోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ కూచున్న చోటు నుంచి అంగుళం కూడా కదలకుండా, చేతులు పైకి, కిందికి కదిలించకుండా ఉంటే చాలా తీవ్రమైన ప్రమాదాలు ఉంటాయి. అవేంటంటే..

గుండె పనితీరు తగ్గుతుంది

వ్యాయామం heartను చురుకుగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా చేసే ఏరోబిక్, కార్డియో వ్యాయామాలు మంచి హృదయ స్పందన రేటు పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే మీరు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా... ఎక్కువసేపు వ్యాయామం చేయకపోతే, మీ గుండె పనితీరు బలహీనంగా ఉండటం, రోజువారీ పనులపై ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. హృదయ స్పందన దెబ్బతింటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ అధిక స్థాయిలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కండరాలు బలహీనపడతాయి
కండర కణాలను మంచి ఆకృతిలో ఉంచడం, వాటిని బలోపేతం చేయడం వ్యాయామం పోషించే ముఖ్యమైన పాత్రలలో ఒకటి. మీరు వ్యాయామం చేయనప్పుడు కండరాల బలం తగ్గిపోతుంది. దీంతో చాలా బలహీనంగా అనిపిస్తుంటుంది. శ్వాస తీసుకోవడానికి అవసరమైన కదలికను సులభతరం చేసే మీ కండరాలలో ఎక్కువ భాగం దెబ్బతింటుంది. 

సాధారణ బరువులు మోయడం కూడా కష్టంగా అనిపించవచ్చు. కండరాల పనితీరు శక్తివంతంగా లేదా మునుపటిలా సహాయకరంగా ఉండకపోవచ్చు. బలహీనమైన కండరాలు మీకు రోజువారీ పనులు చేసుకోవడాన్ని కష్టం చేస్తుంది.

మంచి నిద్ర కష్టం...

నమ్మినా, నమ్మకపోయినా వ్యాయామానికి మంచి నిద్రకు లంకె ఉంటుంది. నిద్ర లేదా వ్యాయామం రెండింటిలో ఏది లేకపోయినా అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. శరీరం తీవ్రంగా అలిసిపోతే తొందరగా నిద్ర పడుతుంది. దీనివల్ల మళ్లీ శక్తిని పుంజుకోగలుగుతారు. నిద్రను సులభతరం చేయడంలో వ్యాయామం పోషించే కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గి, నిద్రను ప్రేరేపించడం జరుగుతుంది. 

గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రతిరోజూ తక్కువ నాణ్యత గల నిద్ర వల్ల అనేక జీవక్రియలు, హార్మోన్ల సమస్యలతో ముడిపడి ఉంది, ఇందులో డయాబెటిస్ ప్రమాదం, బరువు పెరగడం, మానసిక ఆరోగ్యం సరిగా ఉండదు.

ఓర్పును కోల్పోతారు

వ్యాయామం స్టామినాను పెంచుతుంది.  సహనాన్ని పెరిగేలా చేస్తుంది. అదే మీరు వ్యాయామం చేయనప్పుడు, చాలా తక్కువ సమయంలో కోపానికి వస్తారు.  బలహీనంగా మారే ప్రమాదం ఉంది. గుర్తుంచుకోండి, మీ వయస్సుకి మీరు ఎంత ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉన్నారో నిర్ణయించడానికి ఓర్పు అనేది కీలకమైన కొలతగా పరిగణించబడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు 
టైప్ -2 డయాబెటిస్ ఒక పెద్ద ప్రమాద కారకం.  మన దేశంలో చాలా సాధారణం. ఇది చాలా లక్షణాలతో కూడిన జీవక్రియ రుగ్మత అయితే, రక్తంలో చక్కెర పనితీరును దెబ్బతీసే మార్పులలో ఒకటి శారీరక శ్రమ లేకపోవడం. అవును, శరీరం కార్బోహైడ్రేట్‌లను ఎలా ప్రాసెస్ చేస్తుందో నిర్ణయించడంలో వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తక్కువ వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుదలను వేగవంతం చేస్తుంది, వాపు స్థాయిలను పెంచుతుంది. స్థూలకాయాన్ని అధిగమించే అవకాశం ఉంది.
 

విటమిన్ E క్యాప్సూల్ తో తల వెంట్రుకలనుంచి కాలి గోరు వరకు.. ఎన్ని ప్రయోజనాలో..

click me!