విటమిన్ E క్యాప్సూల్ తో తల వెంట్రుకలనుంచి కాలి గోరు వరకు.. ఎన్ని ప్రయోజనాలో..

By AN TeluguFirst Published Oct 25, 2021, 1:23 PM IST
Highlights

తల నుండి ముఖం నుండి గోర్లు వరకు, విటమిన్ ఇ ఆయిల్ మీ శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.విటమిన్ E క్యాప్సూల్స్‌ను ఎలా వాడితే వాటి అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చో చూడండి.. 

Evion క్యాప్సూల్స్ అని కూడా పిలువబడే విటమిన్ E క్యాప్సూల్స్ ఆరోగ్య ప్రయోజనాల స్టోర్‌హౌస్. తల నుండి కాలి గోరు వరకు మీ శరీరంలోని వివిధ భాగాలలో ఈ విటమిన్ నూనెను ఉపయోగించవచ్చు. తల నుండి ముఖం నుండి గోర్లు వరకు, విటమిన్ ఇ ఆయిల్ మీ శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

విటమిన్ E క్యాప్సూల్స్‌ను ఎలా వాడితే వాటి అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చో చూడండి.. 

గోర్ల పెరుగుదల
వంట చేయడం, బట్టలు ఉతకడం లేదా తోటపని చేయడం ఇలా మీ చేతులు రోజంతా వివిధ రకాల పనులు చేస్తూనే ఉంటాయి. ఇలా మీరు చేసే ప్రతీ పని చిప్పింగ్, క్రాకింగ్ లేదా పీలింగ్ రూపంలో మీ గోళ్లపై ప్రభావం చూపుతుంది. bad nail health కారణంగా, గోర్లు పసుపు రంగులోకి మారవచ్చు. విరిగిపోవచ్చు. దీన్ని నివారించడానికి, మీకు కావలసిందల్లా Vitamin E capsule. 

మీ గోర్లు, క్యూటికల్స్,  గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడానికి capsuleలోని నూనెను ఉపయోగించండి. పడుకోవడానికి ముందు ఇలా చేయడం వల్ల మీ గోర్లకు సరైన తేమ లభిస్తుంది. 

ఓవర్ నైట్ క్రీమ్
మాయిశ్చరైజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన విటమిన్ ఇ క్యాప్సూల్స్ Overnight creamగా బాగా పని చేస్తాయి. మీరు మీ రెగ్యులర్ నైట్ క్రీమ్‌లో కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్‌ని మిక్స్ చేయాలి. దీన్ని రాసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని అప్లై చేసుకోవచ్చు. 

ఇది సీరంలా పనిచేసి రాత్రి సమయంలో మీ ముఖానికి తగినంత తేమను అందిస్తుంది. షీట్‌లు లేదా దిండ్లు మరకలు పడకుండా లేదా నూనెను పీల్చుకోకుండా ఉండటానికి, మీరు పడుకునే ముందు కనీసం 30 నిమిషాల ముందు ఇది రాసుకుంటే మంచిది. 

జుట్టు పెరుగుదల
జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందించడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ ఇ ఆయిల్ జుట్టుకు అద్భుతమైన నూనెగా పనిచేస్తుంది. క్యాప్సూల్ నుండి నూనెను బయటకు తీసి, మీ రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌తో కలపండి. దీన్ని మీ జుట్టుకు సున్నితంగా మసాజ్ చేసి 2-3 గంటల పాటు అలాగే ఉంచండి. 

ఆ తరువాత షాంపూ, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.దీని ఫలితాలను కేవలం 2-3 వాష్‌లలో  గమనించొచ్చు. 

యాంటీ రింకిల్ క్రీమ్
చర్మంపై ముడతలు, గీతలు ఉన్నవారికి విటమిన్ ఇ నూనెను యాంటీ ఏజింగ్ క్రీమ్‌గా ఉపయోగించవచ్చు. ఇది యాంటీఆక్సిడెంట్లతో లోడ్ చేయబడింది. కాబట్టి Anti-wrinkle creamగా ఇది బాగా పనిచేస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. విటమిన్ ఇ నూనెను చర్మంపై మసాజ్ చేయడం వల్ల చర్మ నిర్మాణాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ చర్మం దృఢంగా, మెరుస్తూ ఉంటుంది.

వడదెబ్బను నివారిస్తుంది
మీ చర్మం సున్నితంగా ఉంటే.. కాస్త ఎండకే వడదెబ్బకు లోనవుతుంటే, విటమిన్ ఇ ఆయిల్ మీకు ఉపశమనాన్ని అందిస్తుంది. దాని మాయిశ్చరైజింగ్ శక్తి కారణంగా, విటమిన్ ఇ ఆయిల్ పొడి, flaky skinకు చికిత్స చేస్తుంది. వడదెబ్బ కారణంగా మీ చర్మం కాలినా లేదా దురద వచ్చినా, మీరు కూలింగ్ క్రీమ్‌తో కలిపి విటమిన్ ఇ నూనెను ఉపయోగించవచ్చు. అయితే, ఎండలో బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ వాడడం మంచిది. 

అయితే, మీరు దీన్ని ఉపయోగించేముందు ఒకసారి డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. 

దారుణమైన దురాచారాలు.. చనిపోయిన భర్త గోళ్ళతో, జుట్టుతో సూప్ చేసి భార్యకు?

click me!