
బరువు తగ్గించుకోవాలని చాలామంది ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నిస్తుంటారు. ఫుడ్ వల్లే బరువు పెరుగుతాం కనుక ఒక రోజుకి ఎన్ని సార్లు తినాలి అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పడం చాలా కష్టం. దీనికి సైన్స్ పరంగా, లైఫ్ స్టైల్, హెల్త్ కండిషన్, ఫుడ్ హ్యాబిట్స్ పరంగా ఎన్నో సమాధానాలు ఉన్నాయి. దేన్ని ఫాలో అయితే బరువు త్వరగా తగ్గుతామో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా మూడు సార్లు తినడం మనందరికీ అలవాటు. ఇందులో ఓ లాజిక్ ఉంది. ప్రతి సారీ సరిపడా న్యూట్రిషన్ తీసుకుంటే నెక్స్ట్ టైమ్ వరకు ఆకలి ఉండదు. అందుకే అందరూ ఈజీగా ఈ మెథడ్ ఫాలో అయిపోతారు. ఇది చాలా కాలంగా ఫాలో అవుతున్న భోజన విధానం కాబట్టి అందరికీ అలవాటు. ప్లాన్ చేసుకోవడం ఈజీ. ఈ డైట్ ప్లాన్ లో ప్రతి టైమ్ సరిపడా తింటే నెక్స్ట్ టైమ్ వరకు ఆకలి ఉండదు. డైజెషన్ కి టైమ్ దొరుకుతుంది.
ప్రతి సారీ లిమిట్ గా తినాలి. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు. అలా అని బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. ఈ విధానాన్ని ఫాలో అయితే మెటబాలిజం బాగుంటుంది. లంచ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. పడుకోవడానికి 2-3 గంటల ముందు డిన్నర్ తినాలి. తిన్న తర్వాత కాస్త నడిస్తే త్వరగా అరుగుతుంది.
కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక రోజుకి 5 నుంచి 6 సార్లు కొంచెం కొంచెం తింటే వెయిట్ లాస్ అవుతుందంటారు. తినడానికి మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి ఉండదు. ఎక్కువ తినే ఛాన్స్ తగ్గుతుంది. దీంతో మెటబాలిజం బాగుంటుంది. తరచుగా తినడం వల్ల ఆకలి ఉండదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. రోజంతా ఎనర్జీ గా ఉంటారు.
ఫుడ్ లో కరెక్ట్ అమౌంట్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉండాలి. అన్ హెల్తీ స్నాక్స్ అవాయిడ్ చేయాలి. టోటల్ క్యాలరీస్ లిమిట్ లో ఉండాలి. ఇలాంటి డైట్ ఫాలో అవుతూ రోజుకు 5, 6 సార్లు తిన్నా పర్లేదు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డైట్ కాదు. ఇది ఒక తినే పద్ధతి మాత్రమే. కొంత టైమ్ ఫుడ్ తీసుకోకుండా ఉండి, మిగతా టైమ్ లో తినడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఈ విధానం వల్ల వెయిట్ లాస్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయని స్టడీస్ చెప్తున్నాయి.
16 గంటలు కంటిన్యూగా ఫాస్టింగ్ చేయడం
8 గంటల్లో తినడం
5 డేస్ నార్మల్ గా తినడం
2 డేస్ క్యాలరీస్ తగ్గించడం(500-600).
వారానికి ఒకటి లేదా రెండు సార్లు 24 గంటలు ఫాస్టింగ్ చేయడం.
ఇక్కడ చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి ఫాలో అయినా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫాస్టింగ్ టైమ్ లో క్యాలరీస్ తక్కువగా తీసుకుంటాం కాబట్టి వెయిట్ లాస్ అవడం ఈజీ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. ఆటోఫాగీ ప్రాసెస్ యాక్టివేట్ అవుతుంది.
నోట్: అందరికీ ఈ మెథడ్ సూటబుల్ కాదు. ముఖ్యంగా డయాబెటిస్, ప్రెగ్నెంట్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.
మీ వర్క్ టైమింగ్స్ ను బట్టి మీకు నచ్చిన మెథడ్ ఫాలో అవ్వొచ్చు. డైట్ మెథడ్ తో పాటు ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి ఫాలో అవ్వాలి. డైలీ కనీసం 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.
డయాబెటిస్, థైరాయిడ్, PCOS లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే న్యూట్రిషనిస్ట్ లేదా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు మీ హెల్త్ కి సూటబుల్ డైట్ ప్లాన్ చెప్తారు. సోషల్ మీడియా వీడియోలు చూసి డిసైడ్ అయిపోకండి.