
వాషింగ్ మెషిన్ ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటోంది. వాషింగ్ మెషిన్ వాడకం వల్ల ఆడవాళ్లకు చాలా శ్రమ తగ్గిందనే చెప్పాలి. మిషన్.. బట్టలను శుభ్రంగా చేస్తుంది. కానీ మెషిన్ ని శుభ్రం చేయకపోతే మాత్రం అందులో దుమ్ము, ధూళి చేరుతుంది. టైం ప్రకారం శుభ్రం చేయకపోతే… డిటర్జెంట్, బట్టల నుంచి వచ్చే దారాలు, బ్యాక్టీరియా అన్నీ మెషిన్ లోనే ఉండిపోతాయి. దానివల్ల మెషిన్ పనితీరు తగ్గిపోతుంది. దుర్వాసన వస్తుంది. అందుకే వాషింగ్ మెషిన్ ని రెగ్యులర్ గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.
1. వెనిగర్, బేకింగ్ సోడా
మెషిన్ లో ఉన్న దుమ్ము, దుర్వాసన తొలగించడానికి వెనిగర్, బేకింగ్ సోడా బాగా పనిచేస్తాయి. మెషిన్ లో నీళ్లు నింపి, డ్రైన్ బటన్ నొక్కండి. నీళ్లు ఖాళీ అయ్యాక మెషిన్ లో హాట్ వాటర్ సైకిల్ రన్ చేయండి. ఒక కప్పు వైట్ వెనిగర్, కొంచెం ఫిట్కరి పొడి, అరకప్పు బేకింగ్ సోడా కలపండి. ఇది మెషిన్ లో ఉన్న దుమ్ము, దుర్వాసన తొలగిస్తుంది.
2. బ్లీచ్ తో శుభ్రం చేయడం
చాలా రోజుల నుంచి మెషిన్ శుభ్రం చేయకపోతే బ్లీచ్ వాడి శుభ్రం చేయచ్చు. స్క్రూడ్రైవర్ తో మెషిన్ లోపలి ప్లేట్ ని జాగ్రత్తగా తీయండి. బ్రష్ తో దుమ్ము, ధూళి తుడవండి. ఒక బౌల్ లో బ్లీచ్, గోరువెచ్చని నీళ్లు కలిపి మెషిన్ లో పోసి సెకండ్ సైకిల్ రన్ చేయండి. బ్లీచ్ బ్యాక్టీరియాని చంపడంతోపాటు మెషిన్ ని శుభ్రం చేస్తుంది. తర్వాత మెషిన్ ఖాళీగా ఉన్నప్పుడు మళ్లీ ఒకసారి వాటర్ సైకిల్ రన్ చేయండి. దీంతో బ్లీచ్ వాసన కూడా ఈజీగా పోతుంది.
3. డ్రమ్, పైప్ శుభ్రం చేయడం
మెషిన్ లోపల శుభ్రం చేసిన తర్వాత డ్రమ్, గాస్కెట్ ను బ్రష్ తో శుభ్రం చేయాలి. గాస్కెట్ అంచుల్లో దుమ్ము, ధూళి ఉండిపోతుంది. మెత్తటి బ్రష్ తో శుభ్రం చేయండి.
జాగ్రత్తలు
మెషిన్ శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెషిన్ బయట శుభ్రం చేసేటప్పుడు ప్లగ్ తీసేయాలి. నెలకోసారి ఇలా శుభ్రం చేస్తే మెషిన్ బాగా పనిచేస్తుంది.
వాషింగ్ మెషిన్ ని శుభ్రం చేయడం వల్ల మెషిన్ లైఫ్ పెరుగుతుంది. బట్టలు కూడా శుభ్రంగా ఉంటాయి. ప్రతిసారి బయటి నుంచి క్లీనర్ ని పిలిపించి డబ్బులు ఖర్చు పెట్టే బదులు.. మనమే ఈజీగా ఇలా సహజ పదార్థాలతో శుభ్రం చేసుకోవడం మంచిది.