వాలెంటైన్ వీక్ లో లవ్ బడ్స్ విహారానికి వెళ్లడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే..!

By Mahesh RajamoniFirst Published Feb 6, 2023, 4:10 PM IST
Highlights

ప్రేమికులకు  ఒక రోజు ఎంతో ప్రత్యేకమైంది. అదే ఫిబ్రవరి 14. అదేనండి ప్రేమికుల రోజు. ఇక ఈ స్పెషల్ రోజును ప్రేమికులంతా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ వాలెంటైన్ వీక్ కు లవ్ బడ్స్ విహారానికి వెళ్లడానికి బెస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫిబ్రవరి నెల ప్రేమికులకెంతో ప్రత్యేమైంది. ఇక ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రతి రోజూను సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్నే వాలెంటైన్ వీక్ అంటారు. సెయింట్ వాలెంటైన్స్ డే లేదా ఫీస్ట్ ఆఫ్ సెయింట్ వాలెంటైన్సస్ గా కూడా ఈ ఫిబ్రవరి 14 ప్రసిద్ది చెందింది. సెయింట్ వాలెంటైన్ ను క్తైస్తవ అమరవీరుడిని గౌరవించే క్రైస్తవ పండుగ రోజు.. ఈ వాలెంటెన్స్  డే ప్రారంభమయ్యింది. ఇప్పుడు ప్రేమికుల రోజును రొమాంటిక్, హావభావాలను జరుపుకునే గ్లోబల్ హాలిడేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా తమ భాగస్వాములకు ప్రేమ లేఖలు, కార్డులు, పువ్వులు, టెడ్డీలు, చాక్లెట్ల లేదా ఏదైనా ఇతర అందమైన బహుమతులను ఇస్తుంటారు. అంతేకాదు ఈ  రోజున భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. అయితే ఢిల్లీ ఎన్సిఆర్ లో ప్రేమికులు చూడాల్సిన మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. అవేంటంటే.. 

హుమాయూన్ సమాధి

ఇది మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి. ఇది ఢిల్లీలో ఉంది. ఇది దేశంలో మొట్టమొదటి ఉద్యానవన సమాధిగా ప్రసిద్ధి చెందింది. దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. దీనిలోకి వెళ్లడానికి భారతీయులకు 40 రూపాయలు తీసుకుంటే విదేశీయులకు 600 రుసుమును వసూలు చేస్తారు. ఇది మన దేశంలోని అత్యంత సంరక్షించబడిన మొఘల్ స్మారక చిహ్నాలలో ఒకటి. 

కైలిన్ స్కైబార్

రాత్రి పూట దీన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఢిల్లీలోని అత్యుత్తమ రూఫ్ టాప్ లలో కైలిన్ స్కైబార్ ఒకటి. నోరూరించే ఆసియా వంటకాలు, అందమైన ప్రదేశాలు వంటివి ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ తీరొక్క వంటలను ఆస్వాదించొచ్చు

హైజ్ ఖాస్

హౌజ్ ఖాస్ ఢిల్లీలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ వివిధ రకాల బుక్ షాప్ లు, కేఫ్ లు, రెస్టారెంట్లు, హ్యాంగవుడ్ ప్రదేశాలు ఉంటాయి. మీ భాగస్వామితో గడపడానికి ఇదొక అందమైన, రొమాంటిక్ ప్లేస్ అవుతుంది. 

చేరీ

కుతుబ్ బినార్ సమీపంలో ఉన్న చేరి ఢిల్లీలలోని అత్యుత్తమ, అత్యంత రొమాంటిక్ రెస్టారెంట్లలో ఒకటి.  మీ భాగస్వామితో ప్రేమికుల రోజును జరుపుకోవడానికి ఇది సరైన ప్రదేశం. ఈ రెస్టారెంట్ యూరోపియన్, ఇండియన్, ఇటాలియన్, కాంటినెంటల్ వంటకాలను అందిస్తుంది. ఇది ప్రేమికుల రోజును అందంగా మార్చుతుంది. 

లోధీ గార్డెన్స్

న్యూఢిల్లీలో ఉన్న లోధీ గార్డెన్స్ దేశ రాజధాని నడిబొడ్డున ఉండే విశాలమైన గ్రీన్ పార్క్. ఇది ఢిల్లీ సుల్తాన్ ఐదవ, చివరి రాజవంశం పేరు మీదున్న 90 ఎకరాల ఉద్యానవనం. ఇది ఇండో ఇస్లామిక్ శైలిలో ఉంటుంది. అలాగే అష్టభుజి డిజైన్ ఆర్కిటెక్చర్ ను కలిగి ఉంటుంది. ఇది దేశంలో మనుగడలో ఉన్న పురాతన ఉద్యానవన సమాధులలో ఒకకటి.   


 

click me!