ప్రేమికుల రోజు వచ్చేస్తోంది.. మరి రోజ్ డే, ప్రపోజ్ డే, కిస్ డే, హగ్ డే ఎప్పుడెప్పుడో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Feb 6, 2023, 3:08 PM IST
Highlights

వాలెంటైన్స్ డేని ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు. ఈ రోజుకు ముందు రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే లు కూడా ఉంటాయి. వీటిని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ రోజులు ఏయే తేదీన వస్తున్నాయో తెలుసుకోవాల్సిందే.. 

Valentine's Week  2023: ప్రేమికులకు ఇష్టమైన నెల వచ్చేసింది. అదేనండి ఈ నెలలోనే కదా ప్రేమికుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా వన్ సైడ్ లవ్ చేసేవారు లవ్ ను ప్రొపోజ్ చేయడనికి, ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవారు తమ భాగస్వాములపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తపరచడానికి సిద్దమయ్యే ఉంటారు. ఇకపోతే ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు. కానీ ఈ ప్రేమ వేడుక ఒక వారం ముందు నుంచే ప్రారంభమవుతుంది. వాలెంటైన్స్ డే ముందు.. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే లు ఉంటాయి. వీటిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇవి ఏయే తేదీన వస్తున్నాయో తెలుసుకోవాలి.
   
ఫిబ్రవరి 7 - రోజ్ డే

వాలెంటైన్స్ వీక్  ఫిబ్రవరి 7న రోజ్ డే తో ప్రారంభమవుతుంది. ఈ రోజు తమ ప్రియమైన వారికి లేదా క్రష్‌లకు లేదా భాగస్వాములకు గులాబీలను అందించి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ రోజున గులాబీ రంగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తెలుసా? ఎరుపు గులాబీ ఒక వ్యక్తిపై ప్రేమను సూచిస్తుంది. ఇక పసుపు రంగు గులాబి స్నేహాన్ని, ప్రేమకు చిహ్నం. 

ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే

రోజ్ డే తర్వాత అంటే ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే ఉంటుంది. పేరుకు దగ్గట్టు ఈ ప్రపోజ్ డే రోజున వ్యక్తులు తమ ప్రేమను, భావాలను తమ భాగస్వామికి లేదా క్రష్‌కి చెప్తారు. ఈ రోజున చాలా మంది తమ ప్రేమను చెప్పి జీవితాంతం తమతో ఉండాలని అడుగుతారు. 

ఫిబ్రవరి 9 - చాక్లెట్ డే

వాలెంటైన్స్ వీక్‌లోని మూడవ రోజు చాక్లెట్ డే. అంటే ఇది ఫిబ్రవరి 9న వస్తుంది. సంబంధాలలో ఎన్నో రకాల భావాలు కలుగుతాయి. వాటిని మర్చిపోతుంటారు. ఈ చాక్లెట్ డేన  క్రష్‌ లేదా భాగస్వాములు చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ భాగస్వాములకు ఇష్టమైన చాక్లెట్లను ఇస్తుంటారు. కొంతమంది  చేతితో తయారు చేసిన క్యాండీలను బహుమతిగా ఇస్తారు. 

ఫిబ్రవరి 10 - టెడ్డీ డే

వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజు టెడ్డీ డే. ఈ రోజున లవర్స్ తమ భాగస్వాములకు ముద్దు ముద్దుగా ఉండే టెడ్డీ బేర్‌ లను లేదా అందమైన బొమ్మలను గిఫ్ట్ గా ఇస్తారు. ఈ టెడ్డీలు ఒత్తిడిని తగ్గించడానికి లేదా వారి ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి సహాయపడుతాయి. ఈ టెడ్డీలు కూడా ప్రేమను వ్యక్తపరుస్తాయి. 

ఫిబ్రవరి 11 - ప్రామిస్ డే

ఐదవ రోజు ప్రామిస్ డే. ప్రేమికులు, రిలేషన్ షిప్ లో ఉన్నవారు తమ బంధాన్ని బలోపేతం చేయడానికి, ఒకరికొకరు మద్దతుగా, అండగా ఉండేందుకు కొన్ని వాగ్దానాలు చేసుకుంటారు. మీ మధ్యనున్న సంబంధాన్ని కొనసాగించడానికి మీరు కట్టుబడి ఉన్నారని మీ భాగస్వామికి తెలియజేసే ఉద్దేశ్యమే ఈ రోజుకున్న ప్రత్యేకత.  

ఫిబ్రవరి 12 - హగ్ డే

వాలెంటైన్స్ వీక్ లో ఆరవ రోజు హగ్ డే. ఇది ఫిబ్రవరి 12న వస్తుంది. ఈ రోజున తమ ప్రియమైన వారిని కౌగిలించుకుని వారికి నేనున్నా అనే ధైర్యాన్ని ఇస్తారు. ప్రేమను వ్యక్తపరుస్తారు. ఒకరిపై ఉన్న ప్రేమను మాటల్లో చెప్పడానికి రాకపోతే ఇలా కౌగించుకుని మనసులోని తమ భావాలను వ్యక్తపరుస్తారు. మీ ప్రియమైన వారి కోసం మీరు ఉన్నారని, వారి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ కౌగిలి చెబుతుంది. ఈ కౌగిలి ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. నీకోసం నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. 

ఫిబ్రవరి 13 - కిస్ డే

ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు  కిస్ డేను జరుపుకుంటారు. ప్రేమలో ఉన్న వ్యక్తులు ఈ రోజున ఖచ్చితంగా ముద్దు పెట్టుకుంటారు. ముద్దు ఇరువురిని ఆనందంలోకి తీసుకెళుతుంది. అంతేకాదు ముద్దు ఒక వ్యక్తిపై ఎంత ప్రేమ ఉందో చెబుతుంది తెలుసా..

ఫిబ్రవరి 14 - వాలెంటైన్స్ డే

చివరగా  ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున జంటలంతా బయటకు వెళ్లడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, కలిసి సమయాన్ని గడపడం, చేతితో తయారు చేసిన బహుమతులు ఇవ్వడం వంటి పనులతో రోజును ఆనందంగా గడుపుతారు. 

click me!