అసలు మనం వాలెంటైన్స్ డేను ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Feb 6, 2023, 3:36 PM IST
Highlights

ప్రతి పండుగ, లేదా స్పెషల్ రోజును జరుపుకోవడం వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంటుంది. వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకోవడం వెనుక కూడా ఎంతో చరిత్ర ఉందన్న సంగతి మీకు తెలుసా? 
 

Valentine's Day 2023: రేపటి నుంచి వెలెంటైన్స్ వీక్ స్టార్ట్ అవ్వబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమికులకు ఇది పెద్ద పండుగలాంటిదే. ఎందుకంటారేమో.. ఆ రోజంతా జంటలు ఏకాంతంగా సమయాన్ని గడుపుతారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలియజేసుకుంటారు. అయితే ఈ వాలెంటైన్స్ ను సెలబ్రేట్ చేసుకోవడం వెనుక ఎంతో చరిత్ర దాగుందన్న సంగతి మీకు తెలుసా? ఈ వాలెంటైన్స్ రోజును సెయింట్ వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్ విందు అని కూడా పిలుస్తారు.

ఈ రోజు దాని సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నిజానికి ప్రేమను ఒకే రోజు లేదా బహుమతుల ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రత్యేకమైన రోజు ప్రేమికుల జీవితాలకు మరింత సంతోషాన్ని తెస్తుంది. వాలెంటైన్స్ డేకు ముందు రోజులను వాలెంటైన్స్ వీక్ అంటారు. ఈ వారం మొత్తం తమ ప్రియమైన వారిని ఎన్నో విధాలా సర్ ప్రైజ్ చేస్తారు. ప్రేమను వ్యక్తపరుస్తారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే అంటూ ఈ వాలెంటైన్ వీక్ ను జరుపుకుంటారు.  

వాలెంటైన్స్ డే చరిత్ర, ప్రాముఖ్యత

సెయింట్ వాలెంటైన్ అని పిలువబడే క్రైస్తవ అమరవీరుడిని గౌరవించడానికి వాలెంటైన్స్ డేను మొదటగా క్రైస్తవ సెలవుదినంగా జరుపుకున్నారు. సెయింట్ వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్స్ ఫెస్టివల్ వంటి వివిధ పేర్లతో ఈ రోజును పిలుస్తారు. 

ఈ వాలెంటైన్స్ రోజు.. రోమన్ పండుగ లూపెర్కాలియాను పోలి ఉంటుంది. ఇది ఫిబ్రవరి మధ్యలో వస్తుంది. ఈ పండుగ గురించి వివరంగా చెప్పాలంటే ఇది రోమన్ వ్యవసాయ దేవుడైన ఫౌనస్ కు అంకితం చేయబడింది. వాలెంటైన్స్ డేను ప్రపంచంలో ఎక్కడా పబ్లిక్ హాలిడేగా జరుపుకోరు.

ఈ వాలెంటైన్స్ డే ప్రాముఖ్యత కొన్నేండ్ల కాలంలో పాప్ సంస్కృతికి ఇతివృత్తంగా మారింది. ఈ రోజున జంటలంతా ఏకాంతంగా గడుపుతారు. ముఖ్యంగా సినిమా హాళ్లు, మాల్స్, పార్క్ లు అంటూ అంతటా లవ్ బర్డ్స్   ఉంటారు. 

click me!