సాధారణంగా మనం ఇంటికి లేదా షాపుకి తాళం వేస్తుంటాం. ఒక్కోసారి అది ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. కీ పోయినప్పుడు తాళం తీయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఫలితం ఉండదు. అలాంటప్పుడు తాళం పగలగొట్టడం తప్పా వేరే మార్గం కనిపించదు. కానీ ఈ సింపుల్ ట్రిక్స్ తో తాళం ఈజీగా తీసేయవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం.
గ్లిజరిన్ తో తాళం తీయడం ఎలా?
మెడికల్ షాప్ నుంచి పొటాషియం పర్మాంగనేట్ తెచ్చుకోండి. ఇది ఔషధ స్పటికాలతో తయారైన నల్ల ఉప్పు. దీంతో పాటు గ్లిజరిన్ కూడా కొనండి. ఒక చిటికెడు పొటాషియం పర్మాంగనేట్ ని తాళం కీ రంధ్రంలో వేసి, 2-4 చుక్కల గ్లిజరిన్ వేయండి. రంధ్రం నుంచి పొగ వస్తుంది. తర్వాత తాళం ఈజీగా తెరుచుకుంటుంది.
పిన్ తో తాళం తీయడం:
హెయిర్ పిన్ ని 90 డిగ్రీలు వంచి, తాళం కీ రంధ్రంలో పెట్టి పైకి కిందికి వంచండి. తాళం లోపల ఉన్న రాడ్ కదిలి తాళం తెరుచుకుంటుంది. ఇది జామ్ అయిన తాళాలకు కూడా పనిచేస్తుంది.
కత్తితో తాళం తీయడం:
చిన్న కత్తిని తాళం కీ రంధ్రంలో పెట్టి, లోపలి భాగాన్ని తాకేలా లోపలికి తిప్పండి. కత్తిని కీ లాగా తిప్పితే తాళం తెరుచుకుంటుంది.
బట్టల హ్యాంగర్ తో తాళం తీయడం:
బట్టల హ్యాంగర్ ని స్ట్రేయిట్ గా చేసి, దాని చివరను తాళం రంధ్రంలో పెట్టి అటూ ఇటూ తిప్పండి. లోపల ఉన్న రాడ్ కదిలి తాళం తెరుచుకుంటుంది.
ఈ ట్రిక్స్ ఇంటి తాళం.. కీ పోయినప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. టెన్షన్ పడకుండా వీటి ద్వారా తాళం అన్ లాక్ చేయవచ్చు. అయితే తాళం పోయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్స్ వాడటం మంచిది. దుర్వినియోగం చేయడం అస్సలు మంచిది కాదు.