ఈ ఏడాది ఉగాది ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత మీ కోసం..

Published : Mar 14, 2023, 11:53 AM ISTUpdated : Mar 14, 2023, 11:55 AM IST
 ఈ ఏడాది ఉగాది ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత మీ కోసం..

సారాంశం

ugadi 2023: పంచాంగం ప్రకారం.. చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైంది. ఉగాది రోజున విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు పోతాయని నమ్ముతారు. 

ugadi 2023: ఉగాది హిందువులకు ముఖ్యమైన పండుగ. ఈ ఏడాది ఉగాది మార్చి 22న వచ్చింది. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. హిందూ కాలమానం ప్రకారం.. చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున మరాఠీ, కొంకణి హిందువులు గుడి పడ్వాను కూడా జరుపుకుంటారు. 

ఉగాది ఆచారాలు, ప్రాముఖ్యత

ఉగాది రోజున సంప్రదాయ ఆచారాలు నూనె స్నానంతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత  ప్రార్థనలు చేస్తాయి. ఉగాది పర్వదినం సందర్భంగా తలకు నూనె పట్టించి శుభ్రంగా తలస్నానం చేస్తాయి. వాకిళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. మామిడి ఆకులకు అలంకరిస్తారు. 

కొత్తబట్టలు కొనడం, పేదలకు దానాలు చేయడం, ప్రత్యేక స్నానం, ఉగాది పచ్చడిని తయారుచేయడం, వాటిని పంచడం, హిందూ దేవాలయాలను సందర్శించడం వంటివన్నీ ఉగాదిరోజున అనుసరించే కొన్ని సాధారణ పద్దతులు. 

ఉగాది పండుగకు వారం రోజుల ముందే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఇళ్లను పూర్తిగా శుభ్రపరిచి తాజా మామిడి ఆకులతో అలంకరిస్తారు. హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులు, కొబ్బరికాయలు పవిత్రమైనవిగా భావిస్తారు. 

ఉగాది పురాణాలు

ఉగాది పండుగ పుట్టుకకు సంబంధించింది. పురాతన పురాణం ప్రకారం.. బ్రహ్మదేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. ఆ తర్వాత రోజులను, వారాలు, నెలలు, సంవత్సరాలను సృష్టించాడు. అందుకే ఉగాది విశ్వసృష్టి మొదటి రోజు అంటారు.

హిందూ గ్రంధాలలో.. విష్ణువును వివిధ పేర్లతో పిలుస్తారు. అందులో ఒకటి యుగదికృతం. అంటే యుగాలు లేదా యుగాల సృష్టికర్త అని అర్థం. ఉగాది రోజున భక్తులు విష్ణుమూర్తిని నిష్టగా పూజిస్తారు. ఆయన ఆశిస్సులతో సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cancer with Eggs: ఈ గుడ్లలో ప్రమాదకర రసాయనాలు.. తింటే క్యాన్సర్ వస్తుందా?
Winter Diet: చలికాలంలో ఏ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది? ఏవి తినకూడదు?