పొరపాటున కూడా పరగడుపున ఈ ఆహారాలు తినకండి..!

Published : Mar 13, 2023, 04:12 PM ISTUpdated : Mar 13, 2023, 04:15 PM IST
 పొరపాటున కూడా పరగడుపున ఈ ఆహారాలు తినకండి..!

సారాంశం

ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తినడం వల్ల పేగులకు హాని కలుగుతుంది. మీరు ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏంటో ఓసారి చూద్దాం...  

మనం ఉదయం ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. రాత్రిపూట ఖాళీ కడుపుతో మనం మొదట తినే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే మనం తీసుకునే ఆహారాలు రోజంతా ఆరోగ్యంగా ,శక్తివంతంగా ఉంచుతాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగేవారు తమకు ఇష్టమైన ఆహారం తీసుకుంటారు. కొందరు ఖాళీ కడుపుతో టీ, మరికొందరు కాఫీ తాగుతారు. మరికొందరు రసం లేదా పండు తింటారు. కానీ మనకు ఇష్టమైన ఆహారం ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తినడం వల్ల పేగులకు హాని కలుగుతుంది. మీరు ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏంటో ఓసారి చూద్దాం...

ఖాళీ కడుపుతో వీటిని తిని.. మీ ఆరోగ్యానికి హాని కలిగించవద్దు:


కాఫీతో సహవాసం చేయవద్దు: చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ, టీలే తాగడం అంటే ఎక్కువ ఇష్టం. కానీ వాటిని పరగడుపున తీసుకోకూడదట. వీటి వల్ల  మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది.

కారంగా ఉండే ఆహారాన్ని తినవద్దు: మిరపకాయతో చేసిన ఆహారాలు లేదా అధిక మసాలాలు ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇది కడుపులో మంటను కలిగిస్తుంది. మీరు ఎసిడిటీతో బాధపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కడుపు నొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది. సమోసాలు, కచోడీలు లేదా వేయించిన ఆహారాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే ఈ సమస్య పెరుగుతుంది.

ఖాళీ కడుపుతో పెరుగు తినవద్దు: మీరు ఖాళీ కడుపుతో పెరుగు తింటే, మీ కడుపు చల్లగా ఉంటుంది. చాలా మందికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినడం అలవాటు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ కడుపుతో పెరుగు తినడం మంచిది కాదు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తీసుకుంటే ఎసిడిటీ పెరుగుతుంది. మీరు కేవలం పెరుగు మాత్రమే కాదు, పాలతో చేసిన ఆహారాన్ని ఖాళీ కడుపుతో తినకూడదు. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ పొట్టలోని మంచి బ్యాక్టీరియాను చంపి యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది.

జ్యూస్ మంచిదే అయినా, ఖాళీ కడుపుతో తాగకండి: జ్యూస్ ఆరోగ్యానికి మంచిది. వేసవిలో కూడా జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే చాలామంది తమ రోజును జ్యూస్‌తో ప్రారంభిస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండ్ల రసంతో రోజు ప్రారంభించకూడదు. దీంతో ప్యాంక్రియాస్‌పై అదనపు భారం పడుతుంది. ఫ్రక్టోజ్ రూపంలో పండులో చక్కెర ఉన్నందున ఖాళీ కడుపుతో రసం తాగడం వల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో జ్యూస్ తీసుకోకండి.

పచ్చి కూరగాయలు: కొన్ని మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ పరగడుపున మాత్రం తీసుకోకూడదట.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పచ్చి కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఖాళీ కడుపుతో తింటే బరువు పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.

సిట్రస్ పండ్లు: పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. ఇవి యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను క్షీణింపజేస్తుంది. వీటిలో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ కడుపు ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి. నారింజ, బెర్రీస్ వంటి పుల్లని పండ్లను ఉదయాన్నే తినకూడదు.

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!