మారుతున్న వాతావరణంలో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్..!

Published : Mar 14, 2023, 10:44 AM IST
మారుతున్న వాతావరణంలో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్..!

సారాంశం

వాతావరణంలో మార్పు మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. అయితే ఈ సీజన్ లో కొన్ని ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.   

రోగనిరోధక వ్యవస్థ ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి నిరంతరం అంటువ్యాధులతో పోరాడుతుంది. మన రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి మన శరీరానికి శక్తిని అందించడం పోషకాహారం చాలా అవసరం. కానీ కొన్ని కొన్ని సార్లు మనలో పోషకాహార లోపం ఉండొచ్చు.  ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల మనల్ని చురుకుగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అదనపు పోషణ చాలా అవసరం. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మారుతున్న సీజన్ లో ఎలాంటి ఆహారాలు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పుచ్చకాయ

పుచ్చకాయలో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంంది. 6 శాతం చక్కెరలతో లైకోపీన్, విటమిన్ సి, కెరోటినాయిడ్లు  పుష్కలంగా ఉంటాయి. ఈ పండును ముక్కలు చేసి లేదా రసం రూపంలో తినొచ్చు. ఇది హైడ్రేటెడ్ గా ఉండటానికి,  శక్తి స్థాయిలను పెంచడానికి బాగా సహాయపడుతుంది. 

బ్లాక్ ప్లమ్ 

బ్లాక్ ప్లమ్ బాగా ప్రసిద్ది చెందింది. కానీ వీటిని తక్కువగా తింటారు. దీనిలో సుమారు 80 శాతం నీ, 16 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ సి, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిలో యాంటీహైపర్టెన్సివ్, యాంటీహైపర్గ్లైసెమిక్, కార్డియోప్రొటెక్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. 

మామిడి

పండ్లలో రారాజు మామిడి. ఈ పండులో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియలు ఉంటాయి. ఇవి మంటను తగ్గించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ పండు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి మామిడి రసంలో పొటాషియం, మెగ్నీషియం, మాంగిఫెరిన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది వడదెబ్బను నివారించడానికి సహాయపడుతుంది.

సొరకాయ

దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే కాదు విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఇనుము, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, కరిగే ఫైబర్ కూడా ఉంటాయి. ఈ పోషకాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి.

కొబ్బరి నీరు

కొబ్బరి నీటిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పొటాషియం, సోడియం, మెగ్నీషియం కలిగిన ఎలక్ట్రోలైట్లు మీ శరీరానికి ఖనిజాలను అందిస్తాయి. మిమ్మల్ని హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

తులసి విత్తనాలు

తులసి విత్తనాల్లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం, కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆర్ద్రీకరణ, రక్తంలో చక్కెర స్థాయిలు, జీర్ణక్రియకు సహాయపడుతుంది.

పెరుగు

ఇది అద్భుతమైన ప్రోబయోటిక్ ఆహారం మాత్రమే కాదు, కాల్షియం, ప్రోటీన్ కు మంచి మూలం. ఇది దంతాలు, ఎముకలను నిర్మించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

PREV
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!