పుదీనా,తులసీ వంటి ఆకులలో ఔషద గుణాలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే... వీటిలోని ఔషద గుణాలతో ఆరోగ్యంతో పాటు.. అందం కూడా సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
పుదీనా,తులసీ వంటి ఆకులలో ఔషద గుణాలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే... వీటిలోని ఔషద గుణాలతో ఆరోగ్యంతో పాటు.. అందం కూడా సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు మనం చూద్దాం..
పుదీనా, తులసీ ఆకులను నీటిలో మరిగించి.. ఆ నీటిలో కొద్దిగా తేనె కలిిసి.. ముఖానికి పూతలాగా రాయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే ముఖం కాంతి వంతంగా మారుతుంది.
undefined
కేవలం తులసీ, పుదీనా మాత్రమే కాదు.. వేపలో కూడా ముఖారవిందాన్ని పెంచే ఔషదాలు ఉన్నాయి. అంతేకాదు ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండటం వలన మొటిమలు, తామర, సోరియాసిస్, చుండ్రు వంటి సమస్యలకు కూడా మందులాగా పనిచేస్తుంది. వేప ఆకులను నీటిలో మరిగించి.. ఆ నీటితో వారానికొకసారి స్నానం చేయడం వల్ల ఒంట్టో వేడి తగ్గి చర్మం తేమను గ్రహిస్తుంది.
కరివేపాకు ఆహారానికి రుచిని మాత్రమే కాదు.. సౌందర్య సాదనంగా కూడా ఉపయోగపడుతుంది. కరివేపాకునే నీటిలో వేసి బాగా మరిగించి.. ఆ నీటిలో చిటికెడు పసుపును కలిపి.. తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి.