అందమైన, ఒత్తైన కనురెప్పల కోసం...

Published : Dec 31, 2018, 04:12 PM IST
అందమైన, ఒత్తైన కనురెప్పల కోసం...

సారాంశం

మస్కరా అవసరం లేకుండా.. కను రెప్పలను ఒత్తుగా, అందంగా చేసుకోవచ్చు. అది కూడా మన వంటింటిలో లభించే పదార్థాలతో.. 

అందమైన అమ్మాయి అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కళ్లే. కళ్లు పెద్దవిగా.. అందంగా ఉండే అమ్మాయిలు చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు.  అందుకే.. కంటికి కూడా అమ్మాయిలు రకరకాల మెరుగులు అద్దుతుంటారు. కంటి కాటుకతోపాటు.. కను రెప్పలకు మస్కరా వేస్తుంటారు. మస్కారాతో కనుబొమ్మలు ఒత్తుగా కనడతాయి. దీంతో.. అందం మరింత పెరుగుతుంది.

అయితే... మస్కరా అవసరం లేకుండా.. కను రెప్పలను ఒత్తుగా, అందంగా చేసుకోవచ్చు. అది కూడా మన వంటింటిలో లభించే పదార్థాలతో.. రాత్రి నిద్రపోయే ముందు తాజా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంలో ఇయర్ బడ్ ముంచి.. దానిని కనురెప్పల మీద అద్దుకోవాలి. ఇలా వారం పాటు చేస్తే..కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.

నిమ్మ తొక్కను ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంలో వేసి.. ఒక వారం తర్వాత ఆ నూనెను కనురెప్పలకు పూస్తే.. ఫలితం ఉంటుంది. పెట్రోలియం జెల్లీలో మస్కరా బ్రష్ ముంచి.. దానితో కనురెప్పలు అద్దుకోవాలి.. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులు చేస్తే..కచ్చితంగా కను రెప్పలు ఒత్తుగా పెరుగుతాయి. 

PREV
click me!

Recommended Stories

10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు