సాయంత్రం వేళ గోర్లు కత్తిరించకూడదనేది ఇందుకేనా..!

By Mahesh RajamoniFirst Published May 16, 2022, 4:26 PM IST
Highlights

పొరపాటున సాయంత్రం వేళ ఇంట్లో ఎవరైనా గోర్లు కత్తిరించారంటే ఇక వారికి తెల్లవార్లూ తిట్లు తప్పవని చాలా మందికి తెలుసు.. అయితే ఇలా చేయడకూడదు అనే దీనికి అసలు రీజన్ ఏంటో ఎంతమందికి తెలుసు.. 

భారతదేశంలో నివసిస్తున్న అందరూ కూడా ఈ సంప్రదాయాన్ని ఏండ్ల నుంచి పాటిస్తూ వస్తున్నారు. సాయంత్రం లైట్స్ ఆన్ చేసిన తర్వాత నూరు ఆరైనా ఆరు నూరైనా గోర్లను ఎట్టి  పరిస్థితిలో కత్తిరించకూడదని హెచ్చరిస్తారు. పొరపాటున ఎవరైనా కత్తిరిస్తే ఇక వాళ్లకు ఇంట్లో వారి స్పెషల్ తిట్ల క్లాసెస్ తప్పవు.. ! 

సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో గోర్లు కత్తిరిస్తే అశుభం అనే చెప్తారు కానీ ఖచ్చితంగా ఎందుకు కత్తిరించకూడదంటే మాత్రం చెప్పరు.  కొందరు ఈ ఆచారాన్ని నేటికీ మూఢనమ్మకంగానే భావిస్తున్నారు. వాస్తవానికి మన పెద్దలు చెప్పే ప్రతి విషయానికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది.

ఈ సంగతి పక్కన పెడితే సాయంత్రం వేళ గోర్లు తొలగించకూడదనే ఆలోచన కేవలం మన భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ దేశాలు సైతం ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. దీన్ని చెడుకు సంకేతమో లేక దయ్యాలు వస్తాయనో ఇలా చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. నిజానికి ఈ నమ్మకాల వెనుక బలమైన శాస్త్రీయ కారణమే ఉంది. అదేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

ఎనకటి కాలంలో ఇప్పుడు ఉన్నట్టుగా ప్రతి చోట ట్యూబ్ లైట్లు.. అసలు కరెంట్ యే లేదు. ఆ సమయంలో సూర్యాస్తమయం తర్వాత చిమ్నీలు, బుడ్డీ దీపాలను మాత్రమే ఉండేవి. అంతేకాదు ఇప్పుడు ఉన్నట్టుగా నెయిల్ కట్టర్లు కూడా అప్పట్లో లేవు. అందుకే గోర్లలను కట్ చేయడానికి వారు కత్తి లేదా బ్లేడ్లను ఉపయోగించేవారు. ఇక సూర్యాస్తమయం తర్వాత చీకట్లో ఈ పదునైన వస్తువులను ఉపయోగిస్తే వేళ్లు కట్ అయ్యే అవకాశం ఉండేది. అందుకే నైట్ టైం గోర్లను కత్తిరించకూడదనేవారు. 

అయితే కొంతమంది మొండిగా ప్రవర్తించే అలాగే గోర్లను తొలగించేవారు. అలా చేయకూడదని దేవుడు లేదా దెయ్యం పేరు చెప్పి వారిని గోర్లు తీసుకోకుండా చేసేవారు. ఇందులో నిజమేంటంటే.. శాస్త్రీయ కారణాల కంటే మూఢనమ్మకాలు చెప్పినప్పుడే జనాలు ఎక్కువగా నమ్ముతారు. ఆచరిస్తారు అందుకే వినని వాళ్లకు అలా చెప్పేవారు. 

ఇక పగటి పూట ఇంటి లోపల చేతి గోర్లను  లేదా కాలి గోర్లను కట్ చేయడం వల్ల ఈ అపరిశుభ్రమైన మృత చర్మ కణాలు ఇంట్లో అక్కడక్కడా పడిపోవచ్చు. అవి అనుకోకుండా ఆహారాన్ని కలుషితం చేస్తాయి లేదా బట్టలకు అంటుకుంటాయి.  చనిపోయిన చర్మ కణాలు అనారోగ్యం మరియు సంక్రమణకు కారణమయ్యే సూక్ష్మజీవులకు నివాసంగా మారవచ్చు. 

లేదంటే ఇంట్లోని పిల్లలు వీటిని పిల్లలు నోట్లో వేసుకునే ప్రమాదం ఉన్నందున ఇంటి లోపల లేదా సాయంత్రం గోరును తొలగించకుండా ఉండటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం.

అ౦దుకే గాయాన్ని, స౦క్రమణను నిరోధి౦చడానికి, క్రమశిక్షణను బోధి౦చడానికి ప్రజలు సూర్యాస్తమయ౦ తర్వాత తమ గోళ్లను కోసుకోకూడదని నిర్ణయి౦చుకున్నారు. ఇది శాస్త్రీయ కారణం అయినప్పటికీ మూఢనమ్మక౦గా భావించబడింది. 

click me!