dry mouth: నోరు పొడిబారుతోందా? ఈ రోగాలు సోకాయేమో చెక్ చేసుకోండి..!

By Mahesh RajamoniFirst Published May 14, 2022, 12:25 PM IST
Highlights

dry mouth: నోరు పొడి బారడం అనే సమస్య అనేక వ్యాధులకు లక్షణం కావచ్చు. మధుమేహంతో సహా 6 ప్రధాన సమస్యలు నోరు పొడిబారడం యొక్క ప్రాథమిక లక్షణాలుగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

వేసవిలో తరచుగా దాహం వేయడం సర్వ సాధారణం. ఈ సీజన్ లో బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే.. తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఫ్రిజ్ లో నీళ్లకంటే కుండనీళ్లను తాగడమే సేఫ్. అయితే కొంతమందికి ఎన్ని నీళ్లను తాగినా.. దాహం మాత్రం తీరదు. తరచుగా నీరు త్రాగిన తరువాత కూడా మీకు నోరు పొడిబారినట్లుగా అనిపిస్తోందా? దాహం మామూలుగా ఉండి.. నోరు మళ్లీ మళ్లీ పొడిబారడం తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇది అనేక ఆరోగ్య సమస్యల లక్షణం కావచ్చు.

సహజంగా ఎక్కువ సేపు నీరు త్రాగకపోతే కూడా నోరు పొడిబారుతుంది.  అయితే నీళ్లు పుష్కలంగా తాగినప్పటికీ నోరు పొడిబారినట్లయితే మీకు ఈ 6 వ్యాధుల సోకి ఉండవచ్చు. ఏదైనా వ్యాధి సోకితే మన శరీరం దాని లక్షణాలను చూపించడం మొదలుపెడుతుంది. వీటిని లైట్ తీసుకుంటే మాత్రం మీరు ప్రమాదంలో పడ్డట్టే. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరంలోని ప్రతి అవయవం అంతర్గతంగా ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా సమస్య తలెత్తితే ఆ ప్రభావం, లక్షణాలు శరీరంలోని మరో భాగంలో కనిపిస్తాయి.

ఒకవేళ మీ నోటి ఆరోగ్యం క్షీణించినట్లయితే అది ఏదైన ప్రమాదకమైన జబ్బుకు లక్షణం కావొచ్చు. ఇందులో నోరు పొడిబారడం ఒకటి. 

నోరు పొడిబారడం ఎలాంటి వ్యాధులకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.. 
• మధుమేహం
• స్ట్రోక్
• హెచ్ ఐవి
• అల్జీమర్స్
సిండ్రోమ్ (స్జోగ్రైన్ సిండ్రోమ్)
• నరాలు దెబ్బతినడం

లాలాజలం ఉత్పత్తిలో తక్కువ..  నోరు పొడిబారడం అనే సమస్యను వైద్యపరిభాషలో జిరోస్టోమియా అని అంటారు. ఈ పరిస్థితిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంధులు అవసరమైన మొత్తంలో లాలాజలాన్ని ఉత్పత్తి చేయవు. నోటి ఆరోగ్యానికి అవసరమైనంత లాలాజలం ఉత్పత్తి కానప్పుడు నోరు పొడిగా మారుతుంది. కానీ మన నోటి ఆరోగ్యానికి సలైవా ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

లాలాజలం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే యాసిడ్ కంటెంట్ ను నియంత్రిస్తుంది.  అది ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపకుండా రక్షిస్తుంది. కాబట్టి నోరు పొడిబారడం సమస్యకు ఎక్కువ నీరు త్రాగటం ఒక్కటే పరిష్కారం కాదు. ఈ సమస్యకు కారణమేంటో తెలుసుకోవడం ఎంతో అవసరం. 

నోరు పొడిబారడం యొక్క సాధారణ లక్షణాలు 
• నోటి లోపల జిగటగా అనిపించడం 
• శ్వాస నుంచి వాసన రావడం 
• మాట్లాడటంలో ఇబ్బంది, నమలడం, వేగంగా మింగడం
• గొంతులో ఏదైనా ఇరుక్కుపోవడం
• పొడి నాలుక
• రుచిలో తేడా

ఇన్ని విధాలుగా నోరు పొడిగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇలాంటి సమస్య ఆరు నెలల పాటు కొనసాగితే డాక్టర్ ద్వారా పరీక్షలు చేయించుకోకపోతే అది ప్రాణాల మీదికి వస్తుంది.  ఎందుకంటే ఇలాంటి సమస్యలకు త్వరగా చికిత్స చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సమస్య తక్కువగా ఉన్నా.. ముందుగానే చికిత్స పొందడం మంచిది. నోటి పరిశుభ్రత.. తేమతో కూడిన నోటితో ముడిపడి ఉంటుంది. ఒకవేళ పొడిగా ఉన్నట్లయితే నోటి పరిశుభ్రత పాటించడం కష్టంగా మారుతుంది. అప్పుడు వాసన వస్తుంది. చాలా మందికి నోరు పొడిగా ఉన్నప్పుడు, దంతాలపై కూడా మందపాటి మచ్చలు కనిపిస్తాయి.  ఒకవేళ ఇలా జరుగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

click me!