tomato-fever: పిల్లలకు మాత్రమే సోకే టొమాటో ఫీవర్ లక్షణాలేంటి? దీని నుంచి పిల్లల్ని ఎలా రక్షించాలి?

By Mahesh RajamoniFirst Published May 14, 2022, 2:24 PM IST
Highlights

tomato-fever: టొమాటో ఫ్లూ సోకిన చాలా మంది పిల్లలకు దద్దుర్లు, చర్మపు చికాకు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని కొన్ని భాగాల్లో బొబ్బలు కూడా ఏర్పడతాయి. 

tomato-fever: టమోటా జ్వరం అనేది అరుదైన వైరస్. ఇది పిల్లలకు మాత్రమే సోకుతుంది. ముఖ్యంగా ఐదేండ్ల లోపున్న చిన్నారులకు. అయితే ఇది ఏ రకమైన జ్వరమో ఇంకా నిర్దారణ కాలేదు. అయితే ఈ టొమాటో జ్వరం వైరల్ ఫీవరా లేక చికెన్ గున్యా లేదా డెంగ్యూ జ్వరమా అనే చర్చ ఇంకా కొనసాగుతోంది. కానీ ఈ సమస్య బారిన పడిన చాలా మంది పిల్లలకు చర్మంపై దద్దుర్లు, చర్మం చికాకు పుట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు దీనివల్ల శరీరంలోని కొన్ని భాగాల్లో బొబ్బలను కూడా గుర్తించారు. 

టొమాటో ఫీవర్ పేరు ఎలా వచ్చింది.  బ్లిస్టర్ పేరు మీద టొమాటో ఫ్లూ అని పేరు పెట్టారు. ఎరుపు బొబ్బలు చక్రాల టమాటాల మాదిరిగానే కనిపించడం వల్ల ఈ వ్యాధికి టమాటో ఫీవర్ అని పేరు పెట్టారు. ఈ వ్యాధి ప్రస్తుతం కేరళలోని కొల్లంలో పెరిగిపోతూనే ఉంది. అయితే ఇది అతి త్వరలోనే కేరళలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన వ్యాధిని హ్యాండ్, ఫుడ్ మరియు మౌత్ డిసీజ్ అని కూడా అంటారు. 

ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. 

1. ఈ వ్యాధి బారిన పడ్డ పిల్లలకు నీళ్లను బాగా తాగించాలలి. ముఖ్యంగా నీళ్లను బాగా మరిగించి , చల్లారిన తర్వాత తాగిస్తే మంచిది. 

2. బొబ్బలు లేదా దద్దుర్ల వల్ల పిల్లల చర్మంపై ఎలాంటి గీతలు పడవు. 

3. ఈ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ఫ్యూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సోకిన వ్యక్తులు యూజ్ చేసే పాత్రలు, దుస్తులు, ఇతర వస్తువులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. 

4. గోరువెచ్చని నీటిలో క్రిములను నిరోధించే దేనినైనా కలిపి స్నానం చేయించాలి. 

5. పిల్లలకు ఏ చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించండి. 

టొమాటో ఫీవర్: ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు

1. అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో టమాటో ఫ్లూ తో బాధపడుతున్న పిల్లలకు చికిత్స అందించేందుకు కేరళ ప్రభుత్వం 24 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది.

2. టమాటా ఫ్లూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి మూడు బృందాలైన  రెవెన్యూ ఇన్స్ పెక్టర్ , హెల్త్ ఇన్పెక్టర్, పోలీసులను ఏర్పాటు చేశారు.

3. సరిహద్దు జిల్లాలైన మైసూరు, ఉడిపి, దక్షిణ కన్నడ, చామరాజనగర్, కొడగు జిల్లాలోని ఆరోగ్య అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పటల్ల అవుట్ పేషెంట్ విభాగంలో నిఘాను పెంచాలని ఆదేశించారు. 

టొమాటో ఫ్లూ స్వీయ-పరిమితి మరియు దీనికి నిర్దిష్ట ఔషధం లేదు. లక్షణాలు వాటంతట అవే పరిష్కారమవుతాయని, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కానీ టమోటాల వల్ల టమోటా జ్వరం వస్తుందనడంలో ఎలాంటి నిజం లేదు. టమోటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏదేమైనా పరిశుభ్రత మాత్రం ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

click me!