పచ్చ బొట్టు వేయించుకుంటున్నారా...? చావు దగ్గర పడ్డట్లే

By sivanagaprasad KodatiFirst Published Aug 27, 2018, 12:49 PM IST
Highlights

నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనో.. లేదంటే ఇష్టమైన వారి పట్ల ప్రేమను చూపించాలనో చాలా మంది శరీరంపై పచ్చ  బొట్టు వేయించుకుంటున్నారు. చేతులు, కాళ్లు, భుజాలు, నడుము ఇలా ఎక్కడపడితే అక్కడ రంగు రంగుల పచ్చబొట్లను వేయించుకుని మురిసిపోతున్నారు

నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనో.. లేదంటే ఇష్టమైన వారి పట్ల ప్రేమను చూపించాలనో చాలా మంది శరీరంపై పచ్చ  బొట్టు వేయించుకుంటున్నారు. చేతులు, కాళ్లు, భుజాలు, నడుము ఇలా ఎక్కడపడితే అక్కడ రంగు రంగుల పచ్చబొట్లను వేయించుకుని మురిసిపోతున్నారు.

ఇలాంటి వారి క్రేజ్‌ను క్యాష్ చేసుకుంనేందుకు టాటూ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీని జోడించి శరీరంపై మెరుపులు మెరిపించేందుకు లేజర్ టెక్నాలజీని అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఆనందం ప్రాణాలను కూడా తీస్తుందని ఓ  పరిశోధన వెల్లడించింది..

దక్షిణాఫ్రికాలోని కేప్‌‌టౌన్ వర్సిటీకి పరిశోధకులు పచ్చబొట్లపై పరిశోధన చేశారు.. దీనిలో పచ్చబొట్లు వేసేందుకు ఉపయోగించే సూదుల వల్ల ప్రాణాంతకమైన హెపటైటీస్- బీ, సీ కాలేయ జబ్బులు వస్తాయట..ఒకరికి వాడిన సూదులను శుభ్రం చేయకుండా మరోకరికి ఉపయోగిస్తే ప్రమాదాలు  పొంచి ఉన్నాయని తెలిపింది.

అలాగే పచ్చ బొట్టు వేయడానికి ఉపయోగించే ఇంక్‌లో మెర్క్యూరీ వంటి మెటల్స్ ఉండటం వల్ల అది రేడియేషన్‌కు రియాక్ట్ అవుతుందని.. దీని వల్ల ఎలర్జీ, వాపులు వస్తాయని పరిశోధనలో  తేలింది. హెపటైటస్  వైరస్ శరీరంలో చేరిన చాలాకాలం వరకు దాని ప్రభావాన్ని గుర్తించలేరని.. తద్వారా రక్తంలో ఇన్‌ఫెక్షన్ చేరి మరణం వరకూ వెళ్లే ప్రమాదముందని నివేదికలో పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం... భారత్‌లో 60 లక్షల నుంచి 1 కోటి 20 లక్షల మంది ప్రజలు హెపటైటిస్ బీ, సీ వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపింది. టాటూలు వేయడానికి వాడే సూదిని ప్రతిసారి కొత్తది ఉపయోగించాలని.. వాటిని వేసేవారు కూడా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది.

click me!