మీ చెల్లి కట్టిన రాఖీని ఇక నుంచి పెంచుకోవచ్చు.. తినొచ్చు కూడా

By ramya neerukondaFirst Published 25, Aug 2018, 3:00 PM IST
Highlights

వాళ్లు ఎంతో ప్రేమగా కట్టే రాఖీలను పడేయడం వల్లనో, లేదా దాచుకోవడం వల్లనే వచ్చే లాభం ఏమీ లేదు. కానీ.. ఆ రాఖీలు కొద్దిరోజుల తర్వాత ఉపయోగపడేలా ఉంటే.. బాగుంటుందనే ఆలోచనతో కొందరు ఔత్సాహికులు ఈ ఎకో ఫ్రెండ్లీ రాఖీలను మీ ముందుకు తీసుకువచ్చారు.

రాఖీ పండగ వచ్చేస్తోంది. ఈ ఆదివారం అక్కలు, చెల్లెల్లు.. తమకు ఎంతో ఇష్టమైన సోదరులకు రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకుంటారు. వాళ్లు రాఖీలు కడుతుంటారు.. మీరు వారికి ఏదో ఒక గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. ఇది ఒకే.. కానీ.. ప్రతి సంవత్సరం మీ సోదరి కట్టిన రాఖీలను మీరు ఏం చేస్తున్నారు..? కొద్ది రోజుల తర్వాత ఎక్కడైనా పడేసుకోవడమో, లేదా భద్రంగా దాచుకోవడమో చేస్తుంటారు. అవునా.. ఇక నుంచి అలా చేయాల్సిన పనిలేదు. చక్కగా ఆ రాఖీలను పెంచుకోవచ్చు.. కావాలంటే తినేయచ్చు కూడా.

అర్థం కాలేదా.. మార్కెట్లోకి ఇప్పుడు కొత్త రకం రాఖీలు వచ్చేస్తున్నాయి. అవేనండి ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. వాళ్లు ఎంతో ప్రేమగా కట్టే రాఖీలను పడేయడం వల్లనో, లేదా దాచుకోవడం వల్లనే వచ్చే లాభం ఏమీ లేదు. కానీ.. ఆ రాఖీలు కొద్దిరోజుల తర్వాత ఉపయోగపడేలా ఉంటే.. బాగుంటుందనే ఆలోచనతో కొందరు ఔత్సాహికులు ఈ ఎకో ఫ్రెండ్లీ రాఖీలను మీ ముందుకు తీసుకువచ్చారు.

మీ సిస్టర్ మీకు రాఖీ కట్టిన తర్వాత.. వాటిని మట్టితో నిండిన కుండీలో మట్టి ఉంచి అందులో రాఖీనిపెట్టి.. నీరు పోయాలి. అలా రోజు నీరు పొస్తే.. కొద్ది రోజుల తర్వాత అందులో నుంచి ఓ మొక్క మొలుస్తుంది. ఎందుకంటే ఆ రాఖీలో ముందుగానే కొన్ని రకాల విత్తనాలు ఏర్పాటు చేశారు. అలా ఆ రాఖీ మొక్క ద్వారా సజీవంగా మీ కళ్లముందే ఉంటుంది. హైదరాబాద్ నగరంలో గంగాధర్ అనే వ్యక్తి డాల్ఫిన్  రాఖీల పేరిట వీటిని అమ్ముతున్నాడు. ఒక్కో రాఖీ ఖరీదు రూ.300. కుంకుమ, అక్షింతలు, రాఖీ అన్ని కలిపి ఈ ధరకు అమ్ముతున్నట్లు ఆయన వివరించారు.

కేవలం ఇవే కాదు.. బంకమట్టితో( క్లే లేదా టెర్రాకోటా) తో కూడా కొత్తరకం రాఖీలు తయారు చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ లో ఇవే ట్రెండింగ్. ఈ రాఖీలు త్వరగా మట్టిలో కలిసిపోతాయి. చూడటానికి అందంగా ఉండవేమో అని ఆలోచించకండి. ఎందుకంటే.. పూసలు, రాళ్లతో చాలా అందంగా వీటిని తయారు చేస్తారు. వీటిని ఆసక్తి ఉన్నవారు సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు.

ఇవే కాకుండా తినే రాఖీలు కూడా ఉన్నాయి. భోజన ప్రియులకు ఇవి ప్రత్యేకం. కొన్ని బేకరీలు ప్రత్యేకంగా చాక్లెట్స్, కేకులతో వీటిని తయారు చేస్తున్నారు. 

Last Updated 9, Sep 2018, 1:04 PM IST