మగవాళ్లూ ఎక్కువ కాలం ఒంటరిగా ఉంటున్నారా? అయితే అంతే సంగతులు..

By Mahesh RajamoniFirst Published Jan 18, 2022, 11:58 AM IST
Highlights

సింగిల్ గా ఉంటేనే ఆనందం.. ఆహ్లాదం అనేకునే వారు ఇకపై అలా అనుకోవడానికి ఛాన్సు లేదండోయ్. ఎందుకంటే సింగిల్ గా ఉండటం వల్ల అనేక సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. మరి సింగిల్ ఉంటే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా...
 

సింగిల్ గా ఉంటేనే ఆనందం.. ఆహ్లాదం అనేకునే వారు ఇకపై అలా అనుకోవడానికి ఛాన్సు లేదండోయ్. ఎందుకంటే సింగిల్ గా ఉండటం వల్ల అనేక సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. మరి సింగిల్ ఉంటే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా...

సింగిల్ గా ఉంటేనే ఉత్తమం. జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ఒంటిరిగానే ఉండాలని చాలా మంది అబ్బాయిలు భావిస్తుంటారు. పెళ్లి అంటేనే అదో తలనొప్పి,  భారం అని ఫీలవుతూ సంతోషమైన జీవితాన్ని వాయిదా వేస్తూ వెళుతుంటారు చాలా మంది మగవారు. అందులోనూ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయాలంటే బ్యాచిలర్ గానే ఉండాలంటూ హితబోధలు చేసే వారు లేకపోలేదు. అందుకే 30 ఏండ్లు దాటినా ఇంకా బ్యాచిలర్ గానే ఉండటానికి ఇష్టపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే ఎక్కువ కాలం ఒంటరిగా జీవిస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. 

ఒంటరిగా జీవించడం వల్ల వ్యక్తి గత శుభ్రత పాటించకపోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఒంటరిగా బతకడం వల్ల శారీరక, మానసిక సమస్యలతో ఎన్నో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా సంవత్సరాలకు తరబడి ఒంటరిగా ఉండటం, సంబంధాలను తరచుగా తెంచుకోవడం వల్ల రక్త కణాల్లో తేడాలు వచ్చి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితి కేవలం మగవారిలోనే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాలు జర్నల్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ లో ప్రచురించబడింది. ఇలా ఏండ్ల తరబడి ఒంటరిగా ఉండటం వల్ల వయసు రీత్యా అనేక అనారోగ్యాలు, మరణాలు సంభవించే ప్రమాదం ఉందని తేలింది. ఇదీ కాక భాగస్వామితో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటే మానసికంగా క్రుంగి పోయి, శారీరకంగా బలహీనపడిపోయి క్రమ క్రమంగా రోగ నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వెళ్లడైంది. ముఖ్యంగా ఒంటరిగా ఉంటే తొందరగా చనిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వెళ్లడిస్తున్నారు.

ఈ పరిశోధన కోసం 48 నుంచి 62 ఏండ్ల మధ్యనున్న వారినే ఎంచుకున్నారు. ఈ పరిశోధన సుమారుగా 4,835 మందిపై చేసి నివేదికను రెడీ చేశారు. అందుకే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే జీవితంలో ఒంటరిగా ఉండకండి. ఒంటరి జీవితం మనిషికి అంత మంచిది కాదు. ఒక వయస్సు వచ్చాకా తోడు ఉంటేనే జీవితం సంతోషంగా.. అందంగా ఉంటుంది. అందులోనూ జీవితంలో పెళ్లి ఎంతో ముఖ్యం. పెళ్లితో జీవితంలో సంతోషాలు వెళ్లివిరుస్తాయి. అందుకే పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా.. ఆయురారోగ్యాలతో ఉండండి. 

click me!