పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి తండ్రే కారణమా..?

By ramya neerukonda  |  First Published Nov 26, 2018, 3:39 PM IST

 లోపం భార్యభర్తల్లో ఒకరిలో ఉండొచ్చు. లేదా ఇద్దరిలోనూ కనిపించవచ్చు. అయితే.. ముఖ్యంగా ఈ సమస్య పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడంతో మొదలౌతుంది.


పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. పిల్లలు పుట్టుడం లేదని బాధపడే జంటలు చాలా ఉన్నాయి. లోపం భార్యభర్తల్లో ఒకరిలో ఉండొచ్చు. లేదా ఇద్దరిలోనూ కనిపించవచ్చు. అయితే..పురుషుల్లో మాత్రం ముఖ్యంగా ఈ సమస్య పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడంతో మొదలౌతుంది.

కొందరు సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం, ఒత్తిడి తదితర  కారణాల వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది.  అలాంటి అలవాట్లు ఏమీ లేకపోయినా స్పెర్మ్ కౌంట్ తగ్గిందంటే.. దానికి వాళ్ల తండ్రే కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

Latest Videos

మీరు చదివింది నిజమే. భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్తలు వారికి సమీపంలో ఎక్కువగా స్మోక్ చేస్తే... ఆమె కడుపులోని మగబిడ్డపై తీవ్ర పరిణామాలు చూపిస్తాయట. ఆ కడుపులోని బిడ్డ పెరిగి పెద్ద అయ్యి.. యుక్త వయసుకి వచ్చాక.. ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా  ఉండి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో సంవత్సరాలుగా చేసిన పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది. స్మోక్ చేసే తండ్రి ఉన్న యువకులకు, లేని యువకుల వీర్య కణాల సంఖ్యను లెక్కించి మరీ ఈ విషయాన్ని చెబుతున్నామన్నారు. దాదాపు 50శాతం వరకు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం గమనార్హం. ఇలాంటి వారికి పిల్లలు కలగడం చాలా పెద్ద సమస్యగా మారిందని నిపుణులు తెలిపారు. 

ఇక కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే.. వారిపై కూడా ఈ ప్రభావం ఉంటుందట. వారికి ఎక్కువ సంవత్సరాలు పిల్లలను కలిగే సామర్థ్యం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు..

తండ్రి కావాలనుకుంటున్న అబ్బాయిలు చేయాల్సిన మొదటి పని ఇదే

తొలి కలయిక.. నొప్పి తప్పదా..?

click me!