నిమ్మరసం అమ్మిన చోటే ఎస్సైగా బాధ్యతలు.. ఒంటరి మహిళ సక్సెస్ స్టోరీ!

By Navya ReddyFirst Published Aug 8, 2022, 4:07 PM IST
Highlights

పుట్టడంతోనే అందరూ అన్ని సకల సౌభాగ్యాలతో పుట్టరు కొందరు గోల్డెన్ స్పూన్ తో పుడితే మరికొందరు కష్టాల సుడిగుండాలతో పుడతారు. ఇలా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ జీవితంలో ముందుకు నడవాలని పోరాటం చేస్తుంటారు. అయితే జీవితంలో కష్టాలతో పోటీ పడుతూ ముందుకు కొనసాగుతున్న వారికి అదృష్టం ఊహించిన విధంగా రావడం వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం మనం చూస్తుంటాము.

ఇలా ఎంతోమంది కష్టపడుతూ జీవితంలో పైకి వచ్చి మరెందరికో స్ఫూర్తిగా ఉంటారు. అలాంటి వారిలో కేరళకు చెందిన ఎస్సై ఆనీ ఒకరు ఈమె సక్సెస్ స్టోరీ వెనుక ఉన్న కథ తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. తిరువనంతపురం జిల్లాలోని కంజిరాంకుళంకు చెందిన ఎస్.పీ ఆనీ డిగ్రీ మొదటిసంవత్సరం చదువుతున్న సమయంలోనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా తన తల్లిదండ్రులను కూడా ఎదిరించింది.ఇలా తల్లిదండ్రులని ఎదిరించి ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన ఈమెకు పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకు కొడుకు జన్మించాడు.అయితే తనకు కుమారుడు పుట్టగానే తన భర్త వదిలి వెళ్ళడంతో ఆమెను తన తల్లిదండ్రులు కూడా చేర తీయలేదు. ఇలా కట్టుకున్న వాడు వెళ్లిపోవడం కన్నవాళ్ళు దూరం పెట్టడంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. దీంతో తన అమ్మమ్మ చెంతన ఉన్న ఈమె డిగ్రీ చదువు పూర్తి చేశారు.

ఇలా తన అమ్మమ్మ దగ్గర కొన్ని రోజులు ఉన్న అనంతరం తన నుంచి దూరమైన ఈమెకు ఎక్కడ ఉండడానికి కనీసం అద్దె ఇల్లు కూడా దొరకలేదు.ఒకవైపు తన బాబుని చూసుకుంటూనే మరోవైపు చిన్న చితకా పనులు చేస్తూ దూర విద్య ద్వారా పీజీ పూర్తి చేసింది. అయితే వర్కాలా పట్టణంలో నిమ్మరసం, ఐస్ క్రీం అమ్మడం ప్రారంభించారు ఆనీ, ఇలా నిమ్మరసం అమ్ముతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2016లో పోలీసు నియామకాల నోటిఫికేషన్ వెలువడటంతో తన బంధువుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఈమె మొదట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.

తన బంధువుల ప్రోత్బలంతో ప్రోత్సాహంతో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసిన ఈమె ఫిజికల్ టెస్టులలో ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా రాత పరీక్షలలో కూడా ఉత్తీర్ణత సాధించి ఎస్ఐగా ట్రైనింగ్ వెళ్లారు.ఈ విధంగా పోలీస్ ట్రైనింగ్ అనంతరం ఈమె ఒకప్పుడు ఎక్కడైతే నిమ్మరసం ఐస్ క్రీమ్ అమ్ముకున్నారో అదే పట్టణంలో ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నిమ్మరసం అమ్మిన చోటే ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నానని తెలియజేయడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈమెను ప్రశంసించారు. ఇలా ఒంటరిగా బ్రతుకు బండిని లాగుతున్న ఈమె పట్టుదలతో చదువుకొని నేడు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగంలో స్థిరపడి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి.

click me!