వ్యవసాయ భూమిని దీవిగా మార్చేసిన 68 ఏళ్ళ మహిళ.. ఆమె ఒక్క ఆలోచనతో!

By Navya ReddyFirst Published Aug 8, 2022, 3:07 PM IST
Highlights

ఏదైనా సాధించాలని పట్టుదల కృషి ఉంటే చాలు దేనినైనా సాధించగలమని ఎంతోమంది నిరూపించారు. అయితే ప్రస్తుత కాలంలో పంటలు సరిగా పండక ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 68 సంవత్సరాల ఓ వృద్ధ మహిళ తనకున్న పాతిక ఎకరాల భూమిలో అద్భుతాలు సృష్టిస్తోంది. 

నిత్యం తన పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యవసాయం చేయడానికి కూడా అనుగుణంగా లేకపోవడంతో ఆ మహిళకు వచ్చిన ఆలోచన తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్ గుందాకు చెందిన వ్యాపారి కిరణ్ రాజ్‌పూత్ ప్రస్తుతం ఏడాదికి దాదాపు 25 లక్షల రూపాయల వరకు డబ్బు సంపాదిస్తున్నారు. ఇకపోతే ఈమె తనకున్న 25 బిగాల వ్యవసాయ భూమిలో నిత్యం నీరు నిల్వ ఉండడంతో ప్రభుత్వ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు లబ్ధి పొంది మిగతా డబ్బును ఖర్చు చేసి ఏకంగా 11 లక్షల రూపాయలతో చేపల చెరువు ప్రారంభించారు. ఇలా మొదట్లో ఎన్నో నష్టాలను ఎదుర్కొన్న కిరణ్ రాజ్ పూత్ ఎన్నో మెలుకువలు తెలుసుకొని ప్రస్తుతం తన వ్యవసాయ భూమి ద్వారా భారీగా సంపాదిస్తున్నారు.

ఈ విధంగా తన పొలంలో చేపల చెరువుతోపాటు వివిధ రకాల పండ్ల తోటలను పండిస్తున్నారు.అలాగే తన వ్యవసాయ భూమిలో ఒక గెస్ట్ హౌస్ కూడా రూపొందించి ఒక చిన్న పాటి దివి ఏర్పాటు చేశారు.అయితే ఈ అందమైన ప్రదేశాన్ని చూడటం కోసం నిత్యం పర్యాటకలు అక్కడికి వెళుతుంటారు ఇలా పర్యాటకులు ఆ ప్రదేశాన్ని సందర్శించి బోటింగ్ చేయడం,ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అక్కడే గడిపి భోజనాలు చేయడం అలాగే తోటలో తాజా పండ్లను తింటూ ఆస్వాదిస్తూ ఉన్నారు.

ఈ విధంగా ఒకవైపు తన వ్యవసాయ భూమిలో చేపల చెరువును కొనసాగిస్తూనే మరోవైపు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు కిరణ్ రాజ్ పుత్. ఇలా చేపల చెరువు ద్వారా ఏడాదికి ఐదు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని కిరణ్ రాజ్ పూత్ కుమారుడు వెల్లడించారు అయితే ఈమె తన వ్యవసాయ భూమిని తీర్చిదిద్దిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారడమే కాకుండా, ఈమె ఒక వ్యాపారవేత్తగా మారి మరెందరికో ఆదర్శనీయంగా ఉన్నారు.

click me!