
Smoking:ఆధునిక కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడైతే.. వయసు మీద పడే కొద్దే ఈ గుండె సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. పాతికేళ్ల కుర్రాడు సైతం గుండె పోటుతో మరణించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం అతి చిన్న వయసు వారు సైతం ప్రమాదకరమైన గుండె జబ్బుల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అంతెందుకు హైదారాబాద్ లోని ఓ రాజకీయనేత కొడుకు కూడా ఈ గుండె పోటుతోనే ప్రాణాలు విడిచాడు. అతని వయసెంతో తెలుసా.. కేవలం 21 ఏండ్లే.
ఇకపోతే మన దేశంలో 2015 లో ఆరు కోట్లా ఇరవై లక్షల మంది గుండె సంబంధింత సమస్యలతో బాధపడితే.. అందులో రెండు కోట్లా ముప్పై లక్షల మంది 40 ఏండ్ల లోపు వారేనని సర్వే తేల్చి చెప్పింది. అయితే చిన్న వయస్సు వారు కూడా ఈ ప్రమాదకారి బారిన పడటానికి అసలు కారణం వారి లైఫ్ స్టైలేనని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. చెడు ఆహారపు అలవాట్లుతో పాటుగా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, స్మోకింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
రిస్క్ వీరికే ఎక్కువ: ఓ సర్వే ప్రకారం.. దూమపానం చేయని వారితో పోల్చితే.. చేసే వారే ఎక్కువగా గుండె పోటుకు గురయ్యే ప్రమాదం ఉందట. అయితే దూమపానం అలవాటున్న వ్యక్తి ఒక ఏడాది పాటు దీనికి దూరంగా ఉంటే హాట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం సగం వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతిరోజూ స్మోకింగ్ చేసే వారిని , స్మోకింగ్ చేయని వారితో పోల్చితే..చేసే వారిలోలోనే Coronary artery వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు.
మీకు తెలుసా.. కేవలం స్మోకింగ్ చేయడం వల్లే Worldwide గా 10 నుంచి 15 శాతం ప్రజలు గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ స్మోకింగ్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం, కాళ్లల్లో ధమనులు గట్టిగా మారడంతో పాటుగా రక్తనాళాల్లో బ్లడ్ గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తున్నాయట. Heart muscle కు ఆక్సిజన్ను తీసుకుపోయే Blood vessels లో ఫలకలు, గడ్డలు తయారవడానికి అసలు కారణం కూడా దూమపానమే. ఈ కారణంగానే Heart attack వచ్చే అవకాశం పెరిగిపోతోందని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి స్మోకింగ్ అలవాటున్నవారు దాన్ని ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది.
గుండె ఆరోగ్యానికి: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే పోషకవిలువలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. సాల్మాన్, మాకెరెల్, టూనా వంటి చేపలు గుండెకు చాలా మంచివి. కాగా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెండుగా లభించే చేపలు గుండెకు మేలు చేస్తాయి. అలాగే ఓట్స్ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇవి మన శరీరంలో అధికంగా ఉండే కొవ్వులను కరిగిస్తాయి.