మండే ఎండలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

By telugu teamFirst Published Apr 16, 2019, 1:56 PM IST
Highlights


నగరంలో రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. మొన్నామధ్య రెండు రోజులు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ పెరిగిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. 

నగరంలో రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. మొన్నామధ్య రెండు రోజులు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ పెరిగిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి గురై వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలౌతున్నారు. దీనికి తోడు కుక్క కాట్లు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. 

ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా మనిషి రోజుకు 7–8 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపిస్తే.. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపి నీళ్లు తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది. 

సాధ్యమైనంత వరకు ఉదయం 10గంటల లోపు, సాయంత్రం 5గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. ఎండలకు త్వరగా దాహం వేస్తుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. 

ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్‌ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమటపొక్కుల సమస్య ఉండదు. రోజు రెండుసార్లు స్నానం చేయాలి.

ఎండ తీవ్రత మనతోపాటు కుక్కలపై కూడా ఎక్కువగానే ఉంటుంది. రిపడా ఆహారం లభించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తదితర కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. 

ఈ క్రమంలో అవి కనిపించిన వారి మీద పడి కరిచేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. అందుకే ఈ కాలంలో కుక్కలకు కొంచెం దూరంగా ఉండాలి. ఒకవేళ కుక్క కరిస్తే.. నీటితో  కడిగి వైద్యులను సంప్రదించాలి. ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 

click me!