సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మందు.. బంగారం కన్నా ధర ఎక్కువ

By telugu teamFirst Published Apr 15, 2019, 2:36 PM IST
Highlights

ఒకప్పుడు దంపతులు డజన్ల కొద్దీ పిల్లలను కనేవారు. వయసు 60కి దగ్గరపడుతున్నా... శృంగారం విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. పాతతరం వారి లో ఉన్న సామర్థ్యం ఇప్పటివాళ్లలో ఉండటం లేదు. 

ఒకప్పుడు దంపతులు డజన్ల కొద్దీ పిల్లలను కనేవారు. వయసు 60కి దగ్గరపడుతున్నా... శృంగారం విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. పాతతరం వారి లో ఉన్న సామర్థ్యం ఇప్పటివాళ్లలో ఉండటం లేదు. పని ఒత్తిడి, సరైన పోషకాహారం ఇలా కారణాలు ఏవైనా సామర్థ్యం తగ్గిపోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నూటికి 60శాతం మంది పురుషులు ఈ విషయంలో వైద్యులను సంప్రదిస్తున్నారు.

అయితే.. ఇలాంటి వారి కోసం శాస్త్రవేత్తలు ఓ మందు కనిపెట్టారు. కాకపోతే అది బంగారం కన్నా ఖరీదు ఎక్కువ. హిమాలయాల్లో ఓ అరుదైన మొక్క (యర్సాగుంబా) సెక్స్ సామర్ధ్యాన్ని అమాంతం పెంచుతోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ ప్రకారం దీని ధర కేజీ రూ.60లక్షలు పలుకుతోంది.

హిమాలయాల్లో తిరిగే ఒక జాతి గొంగళిపురుగులకు ఫంగస్ వ్యాపిస్తుంది. ఆ ఫంగస్ గొంగళి పురుగును తినేస్తూ... మొక్కగా ఎదుగుతుంది. ఈ ప్రక్రియ జరిగేందుకు 9 నెలలు పడుతుంది. ఈ మొక్కల్ని సేకరించే అక్కడి ప్రజలు వాటిని ఎండబెడుతున్నారు. 

అలా ఎండిన యర్సాగుంబాను తిన్నా, దాన్ని పొడిచేసుకొని తిన్నా, దాన్ని వంటల్లో వేసుకొని తిన్నా సెక్స్ సామర్ధ్యం బోల్డంత పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఆన్‌లైన్‌లో దొరుగుతున్న ఈ యర్సాగుంబా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకపోవడం విశేషం.

నేపాల్ వాస్తవ్యులు హిమాలయాల్లో సంచరించి ఈ యర్సాగుంబాను సేకరించి అమ్ముతుంటారు. దీనిని ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా అమ్మకానికి పెడుతున్నారు. 

click me!