నావల్ల ఎవరికైనా పిల్లలు పుట్టారా..? చెప్పండి ప్లీజ్

By ramya neerukonda  |  First Published Sep 28, 2018, 3:24 PM IST

ఏ ఒక్క అమ్మాయితోనూ మూడు నెలలకు మించి ఉండలేకపోయాను. నేను విచ్చలవిడిగా తిరిగానని చెప్పొచ్చు. అలా తిరిగినందుకు నేనేం బాధపడటం లేదు. వేలాది మంది మహిళలతో ఎంజాయ్ చేశాను. 


నావల్ల ఎవరికైనా పిల్లలు పుట్టారా..? దయచేసి నాకు చెప్పండి. చెప్పిన వారికి నగదు బహుమతి కూడా ఇస్తానంటూ ఓ వ్యక్తి ప్రాధేయపడుతున్నాడు. అతను అలా ఎందుకు అడుగుతున్నాడు అనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

యూరప్ కి చెందిన ఓ వ్యక్తి(61) జీవిత చరమాంకానికి చేరుకున్నాడు. ఇతనో పెద్ద బిజినెస్ మ్యాన్. పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో దాని జోలికి పోలేదు. కానీ.. యవ్వనంలో ఉన్నప్పుడు వేల మంది అమ్మాయిలతో సెక్స్ చేశాడు. యూరప్ తోపాటు బిజినెస్ పనిమీద ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ అమ్మాయిలతో హాయిగా ఎంజాయ్ చేసేవాడు.

Latest Videos

ఇప్పుడు ఆయన వయసు 60దాటింది. వయసు మీదపడి ఆరోగ్యం క్షీణించాక.. తనకంటూ కుటుంబం ఉంటే బాగుండనిపించింది. అందుకే తనతో సెక్స్ చేసినవాళ్లలో ఎవరికైనా తన వల్ల పిల్లలు పుట్టారా..? అనే విషయం తెలుసుకునే పనిలో పడ్డాడు. ఈ విషయంలో తనకు హెల్ప్ చేసిన వారికి రూ.5వేల పౌండ్లు ఇస్తానని ఆఫర్ చేస్తున్నాడు. 

తనకు పిల్లలు ఉన్నార లేదో తెలుసుకోవాలంటే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియాకు ప్రయాణించాల్సి రావొచ్చని చెప్పాడు. తన పేరు వెల్లడించడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. 

సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను వెల్లడించిన ఆయన.. ‘‘నేను 61 ఏళ్ల బ్యాచిలర్‌ను. ఏ ఒక్క అమ్మాయితోనూ మూడు నెలలకు మించి ఉండలేకపోయాను. నేను విచ్చలవిడిగా తిరిగానని చెప్పొచ్చు. అలా తిరిగినందుకు నేనేం బాధపడటం లేదు. వేలాది మంది మహిళలతో ఎంజాయ్ చేశాను. వారిలో ఎవరైనా నా బిడ్డకు తల్లయ్యే అవకాశం ఉందేమో. ఈ విషయాన్ని నేను కనిపెట్టడం కష్టమనుకుంటున్నా’ అని చెప్పాడు. 

‘ఇప్పుడు ఉన్నంత విరివిగా.. అప్పట్లో గర్భనిరోధక విధానాలు అందుబాటులో లేవు. అందుకే నేను తండ్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నా. గత కొన్నేళ్లుగా నా ఆరోగ్యం క్షీణిస్తోంది. వయసు మీద పడుతుండటంతో.. సెంటిమెంటల్‌గా ఫీలవుతున్నా. విజయం కంటే జీవితం ముఖ్యమని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు కుటుంబం కోసం ప్రయత్నించడం నిష్ఫలమని నాకు తెలుసు. కానీ ప్రయత్నించకపోతే నేనెప్పుడూ చింతించాల్సి వస్తుంది’ అని ఆయన చెప్పుకొచ్చాడు.

click me!