గర్భవతులకు సూచనలు: ఆరోగ్యకర బేబీకి నాలుగు సూత్రాలు

First Published Jul 23, 2018, 12:14 PM IST
Highlights

గర్భం దాల్చిన ప్రతి యువతి కూడా తన రోజువారీ భోజనపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మీరు గర్భవతిగా ఉన్నారా? అయితే భోజన అలవాట్ల విషయమై రేపటి కోసం వాయిదా వేయొద్దు. ప్రతి మహిళ కూడా గర్భవతైన తొలి రోజుల్లో 55 వేల కేలరీల పరిమాణం గల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ప్రతి పసికందుకు రోజుకు అదనంగా 300 కేలరీల శక్తి కావాలి. 

కాబోయే తల్లి తన భోజనంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకోవడం చాలా కీలకం. గర్భవతులైన మహిళలు, యువతుల భోజన అలవాట్లు పుట్టే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కనుక గర్భం దాల్చిన ప్రతి యువతి కూడా తన రోజువారీ భోజనపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కీలక వారాల్లో ప్రతి అడుగు, సదరు గర్భవతుల ప్రతి చర్య కూడా కీలకమేనని అంటున్నారు. 

చాలా సమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవడంతోపాటు కొవ్వు, షుగర్స్ ఆహారాన్ని తగ్గించాలి. కార్బోహైడ్రేట్లు తగిన మోతాదులో భోజనంలో ఉండేలా గర్భవతులు చూసుకోవాలి. వేపుడు పదార్థాల కోసం కోరికలు పెంచుకోవద్దు. యువతులు తమ భోజనపు అలవాట్లలో చిన్న, ఆరోగ్యకరమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నది. వెరైటీ ఆహార పదార్థాలతో కూడిన భోజనం తీసుకోవడం చాలా కీలకంగా ఉంటుంది. ప్రోటీన్లు, పోషకాలు సమంగా ఉండేలా మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి. 

గర్భవతులు నిత్యం నీళ్లు తాగుతూనే ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా శరీరంలో రక్తం పరిమాణం పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో మలబద్ధకం, అలసట నుంచి నివారించొచ్చు. తద్వారా నిత్యం బాత్రూమ్‌కు వెళ్లకుండా.. అసౌకర్యం నుంచి దూరం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఛీజ్, టోఫు, ఫల రసాలు, మెత్తని మాంసం, కోడిగుడ్లు, చేపలు, గింజలతో కూడిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు, కాల్షియం, క్రొవ్వు, ఫీచు పదార్థాలు తప్పనిసరిగా వాడాలి. ప్రసవానికి ముందే రోజువారీ భోజనంలో విటమిన్లు ఉండేలా జాగ్రత్తలు వహించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వెన్నతో వేయించిన బఠాణి, వేరుశనగ గింజలు, టర్కీ బ్రస్ట్, డార్క్ చాక్లెట్, కారెట్లు, బెర్రీలు వంటివి భోజనంలో తప్పక తీసుకోవాలి. గర్భం దాల్చిన వారు ప్యాకేజ్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. గోట్ చీజ్, ప్రాసెస్డ్ మీట్, ఉడికీ ఉడకని మాంసం, సీ ఫుడ్, పానీయాలు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం అత్యవసరం అని చెబుతున్నారు. బాగా తింటూ ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ నవ్వుతూ గడపాలని అంటున్నారు.

click me!