Personality Test: మీరు కూర్చునే విధానమే.. మీరేంటో చెప్తుంది తెలుసా..

By Mahesh RajamoniFirst Published Jun 24, 2022, 11:34 AM IST
Highlights

Personality Test: ఒక్కొక్కరు ఒక వ్యక్తి ప్రవర్తణను బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అయితే సిట్టింగ్ పొజీషన్ ను బట్టి కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. 
 

Personality Test: ముక్కు ఆకారం, నిద్రపోయే స్థానం, ఇష్టమైన కాఫీ, నడక వంటి వాటి ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను ఇదివరకే తెలుసుకున్నారు. సిట్టింగ్ పొజీషన్ ను బట్టి కూడా ఒక వ్యక్తి  వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. .

నిపుణులచే నిర్వహించబడ్డ ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం.. కాలు స్థానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని కనుగొనబడింది. మన కాళ్ళు, పాదాలు మన వ్యక్తిత్వాల గురించి తెలుపుతాయట. మన అంతఃచేతన (Subconscious)గుండా ప్రేరేపించబడిన ఆదేశాల ఆధారంగా కాళ్ళు పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది మనకు కావలసిన దిశలో వెళ్ళడానికి లేదా ప్రమాదం లేదా ఆందోళన, విసుగు, అభద్రత మొదలైన ప్రతికూల భావోద్వేగాలకు గురైనప్పుడు దూరంగా వెళ్ళడానికి Hard wired చేయబడుతుంది.

Sitting Position 1: మోకాళ్లు నిటారుగా (Knees Straight)

కీలక లక్షణాలు: ఇంటెలిజెంట్, హేతుబద్ధమైన ఆలోచనాపరులు, సమయపాలన, స్మార్ట్ వర్కర్లు, పరిశుభ్రత ప్రేమికుడు, నిజాయితీపరుడు కానీ Reserved.

ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో.. మోకాళ్ళు నిటారుగా పెట్టి కూర్చునే వ్యక్తులు వారి ఇంటర్వ్యూల సమయంలో సక్కెస్ అవుతారని తమకే ఆ ఉద్యోగం వస్తుందిని.. ఆ ఉద్యోగ పాత్రకు అర్హులుగా భావించబడుతున్నారని వెల్లడైంది. వారు తమను తాము వారి నైపుణ్యాలను విశ్వసించే వ్యక్తిగా కూడా ఉంటారు. వారు తమ పట్ల ఆరోగ్యకరమైన, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు తక్కువ అభద్రతాభావాలను కలిగి ఉంటారు.

మోకాళ్లను నిటారుగా ఉంచి నిటారుగా కూర్చోవడం.. అధిక స్థాయి ఆత్మవిశ్వాసానికి సూచిక. ఈ వ్యక్తులు తెలివైనవారు, హేతుబద్ధమైన ఆలోచనాపరులు. వారి దైనందిన జీవితంలో సమయపాలన కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఏదైనా ప్రదేశానికి గానీ, సమావేశానికి లేదా ఇంటర్వ్యూకు గానీ ఆలస్యంగా వెళ్లే ఛాన్సెస్ చాలా  తక్కువ. 

వీళ్లు స్మార్ట్ వర్కే ఎక్కువగా చేస్తారు. వీళ్లుంటే ప్లేస్, ఇల్లు, వంటగది, లేదా ఆఫీసు స్థలం, వర్క్ స్పేస్ ని చక్కగా సర్దుకుంటారు. నీట్ గా ఉంచుకుంటారు. ఇంట్లో గానీ ఆఫీసు ప్లేస్ లో గానీ ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతారు. వీళ్లు నిజాయితీగా ఉంటారు. అయితే చాలా రిజర్వ్ గా ఉంటారు. గాసిప్ లు లేదా ఒక వ్యక్తి లేనప్పుడు తనగురించే మాట్లాడే వారికి దూరంగా ఉంటారు. వీరు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. లేదా తమను తాము అదుపులో ఉంచుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటారు. 


Sitting Position 2: మోకాళ్లు వేరుగా ఉండటం (Knees Apart)

కీలక లక్షణాలు: స్వీయ-కేంద్రీకృత, అహంకారం, జడ్జిమెంటల్, తక్కువ శ్రద్ధ, త్వరగా విసుగు చెందుతారు.

మోకాళ్లను వేరుగా ఉంచి కూర్చునే వ్యక్తులు అహంకారంగా ఉంటారు. అధ్యయనాల ప్రకారం..  వీరు ఆతురత, ఆందోళన కలిగించే వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది. మీరు పరిపూర్ణత (Perfection) కోసం ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారంటే.. ఏదో తప్పు జరుగుతుందనే భయంతోనే సమయాన్ని గడుపుతుంటారు. 

మోకాళ్లను వేరుగా ఉంచి కూర్చునే వ్యక్తులు అస్తవ్యస్తమైన మనస్సును కలిగి ఉంటారని పరిశోధనలో తేలింది. ఏకాగ్రతను పొందడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. వీళ్లు ఎప్పుడూ.. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ ఇలాంటి వారు ఒక పనిని మొదలు పెట్టినప్పుడు దానిని సరిగ్గా చేయలేరు.

వీళ్లు చాలా తెలివిగా మాట్లాడతామని అనుకుంటారు. కాని సాధారణంగా వీరి ఆలోచనలు విచ్ఛిన్నమవుతాయి. వారు తమ మాటల పర్యవసానాల గురించి ఆలోచించే ముందు మాట్లాడతారు. లేదా సంభాషణ మధ్యలో మాట్లాడాల్సిన మాటలను మర్చిపోతారు. వీరు తేలికగా విసుగు చెందుతారు. నిరాసక్తత కలిగి ఉంటారు. సంబంధాలను తొందరగా విడిచిపెడతారు. వీరికి క్రమశిక్షణ అవసరం. పురుషులు సాధారణంగా మోకాళ్లను వేరుగా ఉంచి కూర్చుంటారు. దీనిని మ్యాన్ స్ప్రెడింగ్ (Man Spreading) అని కూడా పిలుస్తారు. 

Sitting Position 3: క్రాస్డ్ లెగ్స్ (Sitting Position )

కీలక లక్షణాలు: కళాత్మక, సృజనాత్మక, ఊహాత్మక, డ్రీమర్, డిఫెన్సివ్ లేదా క్లోజ్డ్-ఆఫ్.

మీరు కళాత్మకంగా ఉన్నారా? మీరు కళ్ళు తెరిచి చాలా కలలు కంటున్నారా? కుడివైపు మీ కాళ్ళను ముడుచుకొని కూర్చునే అలవాటు ఉందా?  మీరు క్రాస్డ్ కాళ్లతో కూర్చునే వ్యక్తి అయితే..  సృజనాత్మక ఆలోచనలతో ఉంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీళ్లకు ఊహాత్మకమైన ఆలోచన ఉంటుంది. మీరు చాలా డ్రీమర్ కూడా . నలుగురు వ్యక్తులతో కలిసి కూర్చున్నప్పుడు కూడా వీరి ఆలోచనలోనే ఉంటారు. సాధారణంగా వీళ్లు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.

క్రాస్డ్ లెగ్స్ తో కూర్చోవడం కూడా రక్షణాత్మక లేదా క్లోజ్డ్-ఆఫ్ వైఖరిగా వస్తుంది. మీరు కాపలాగా ఉండవచ్చు. వీరు వీరి జీవితంలో మరొకరిని కోరుకోకపోవచ్చు.  లేదా అనుమతించలేకపోవచ్చు. వీరు చాలా భయపడతారు. లేదా అభద్రతను కలిగి ఉంటారు.

క్రాస్డ్ కాళ్లతో కూర్చున్నప్పుడు రిలాక్స్ గా లేదా భయంగా ఉన్నట్లైతే.. ఖచ్చితమైన రీడింగ్ ఇవ్వవచ్చు. మీరు మీ కుర్చీలో రిలాక్స్ డ్ గా కూర్చొని, మీ కాళ్లను ముడుచుకొని, మీ పాదాన్ని మీ ఎదురుగా ఉన్న వ్యక్తి దిశలో ఉంచినట్లయితే.. అప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో కూడిన సంభాషణను ఆస్వాదిస్తారు.

అయితే మీరు ఇరుకుగా కూర్చొని లేదా మీ కాళ్లను గట్టిగా క్రాస్ చేసి చంచలంగా ఉంటే.. మీరు అసౌకర్యంగా ఉన్నారని అర్థం. ఆ క్షణంలో మీ మనస్సు పూర్తిగా మరెక్కడో ఉంటుంది. 

Sitting Position 4: చీలమండ-క్రాస్డ్ (Ankle-Crossed)

కీలక లక్షణాలు: సొగసైన, డౌన్-టు-ఎర్త్, కాన్ఫిడెంట్, రీగల్, ప్రతిష్టాత్మక, రక్షణాత్మక

చీలమండలు క్రాస్ చేసి కూర్చోవడం అనేది బ్రిటిష్ రాజకుటుంబంలో ఒక సాధారణ సిట్టింగ్ పొజిషన్ అని మీకు తెలుసా? మీరు చీలమండలను క్రాస్ చేసి కూర్చుంటే.. మీకు రాజరికం, రాణి లాంటి జీవన విధానం ఉందని అర్థం. వీరు ఏ పరిస్థితిలోనైనా ఆత్మవిశ్వాసంతో, సౌకర్యవంతంగా ఉంటారు. వీరు చాలా అరుదుగా భయాందోళనలకు గురవుతుంటారు.  వాస్తవానికి వీరు తమ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉండేట్టు చూస్తారు. 

వీరి లక్ష్యాలను సాధించడానికి ఎంతో కష్టపడతారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. మీ కృషి మంచి ఫలితాలను ఇస్తుందని దృఢమైన నమ్మకం వీరికి ఉంటుంది. ప్రతి ఒక్కరి రహస్యాలను తెలుసుకుంటారు. అయితే వీళ్లు మాత్రం తమ రహస్యాలను, విషయాలను మరెవరితోనూ పంచుకోరు. వ్యక్తిగత విషయాలలో చాలా అహంకారంతో ఉంటారు. వీళ్లు తమ రూపం గురించి ఆందోళన చెందుతారు. 

ప్రవర్తనా నిపుణులు, మనస్తత్వవేత్తలు కూడా చీలమండలను క్రాస్ చేసి కూర్చోవడం కూడా కొన్ని సందర్భాల్లో రక్షణాత్మకత, అభద్రతకు సూచిక అని వెల్లడించారు.  

Sitting Position 5: Figure Four Leg Lock

కీలక లక్షణాలు: ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం, యవ్వనం, సురక్షితమైన, కంటెంట్, వాదనాత్మక, పోటీతత్వం

కాళ్లను క్రాస్ చేసి, ఒక చీలమండను మరో మోకాలిపై ఉంచి కూర్చునే వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఈ రోజుల్లో ఇది ఆడవారిలో సర్వసాధారణంగా మారుతోంది. ఏదేమైనా, లింగంతో సంబంధం లేకుండా నాలుగు క్రాస్డ్ కాళ్లతో కూర్చుంటే .. ఇతర సిట్టింగ్ స్థానాలు ఉన్న వ్యక్తులతో పోలిస్తే మీరు మరింత ఆధిపత్యం, రిలాక్స్డ్, ఆత్మవిశ్వాసం,యవ్వనంగా ఉన్నట్లు కనుగొనబడ్డారు.  వీరికి వీరు సురక్షితంగా, సంతృప్తిగా ఉంటారు. 

వీరు లక్ష్యాలను సెట్ చేసుకుంటారు. వాటిని సాధించేంత వరకు తెలివిగా పనిచేస్తారు. కెరీర్ లో సెటిల్ అయ్యేందుకు శ్రద్ధగా చదువుతారు. వీరి పర్సనల్ విషయాలను ఎవరికీ చెప్పుకోరు. 
ఫిగర్ ఫోర్ స్టైల్ తో కూర్చున్న వ్యక్తులు ప్రతిదానికీ సమయం వస్తుందని నమ్ముతారు. వీళ్లు అందంగా కనిపించడానికి మంచి మంచి దుస్తులను ధరిస్తారు. అయితే వీళ్లు వాదనాత్మక లేదా పోటీ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. స్వంత అభిప్రాయాలు కాకుండా ఇతర అభిప్రాయాలను తిరస్కరించే అవకాశం ఉంది.
 

click me!