పెళ్లయిన కొత్తలో: నరకం అంటున్న నవవధువులు.. వేధింపులు కాదు..సిగ్గుతో

First Published 9, Jul 2018, 2:37 PM IST
Highlights

పెళ్లయిన కొత్తలో అత్తారింట్లో నరకం అనుభవిస్తున్నారట కొత్త పెళ్లికూతుళ్లు. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లల మనోగతాన్ని తెలుసుకునేందుక ఒక జాతీయ దినపత్రిక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కొందరు మహిళలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు

కోటీ ఆశలతో అత్తారింట్లో పాదం మోపే నవవధువుల మనసులో ఎన్నో ఆలోచనలు.. తనను అక్కడ అందరూ ప్రేమగా చూసుకుంటారా..? భర్త తనను వెనకేసుకొస్తాడా..? తోటికోడళ్లు, ఆడపడుచులతో ఎలా ఉండాలో ఇలాంటి సవాలక్షా ఆలోచనలు కొత్త పెళ్లికూతురి మనసును తొలిచివేస్తాయి.

అయితే వేధింపులు ఏం లేకపోయినా పెళ్లయిన కొత్తలో అత్తారింట్లో నరకం అనుభవిస్తున్నారట కొత్త పెళ్లికూతుళ్లు. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లల మనోగతాన్ని తెలుసుకునేందుక ఒక జాతీయ దినపత్రిక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కొందరు మహిళలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. 

* పెళ్లై అత్తవారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచి అక్కడి వాతావరణానికి అలవాటుపడటం చాలా కష్టమట. కొత్త ప్రాంతం, కొత్త కుటుంబంతో మన జీవితాన్ని ప్రారంభించాలని.. కొత్తగా ఆ ఇంట్లో కనిపించడం వల్ల అందరూ కోడల్ని గమనిస్తుంటారని.. కొందరు గుచ్చి గుచ్చి చూస్తుంటారని.. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుందని అమ్మాయిలు తెలిపారు.

* వివాహమైన కొత్తల్లో వంటగదిలోకి వెళ్లడం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుందట. తాను తొలిరోజున వంటగదిలోకి వెళ్లి, ఏది ఎక్కడుందో తెలియక ఇబ్బందులు పడ్డట్టు చాలామంది నవవధువులు వెల్లడించారు.

* పెళ్లై నాలుగు వారాలు గడుస్తున్నా.. భర్త ముందు బట్టలు మార్చుకోలేకపోతున్నామని.. రాత్రిపూట భర్త తన దుస్తులు తొలగిస్తున్నా... తెల్లారాక ఆయన ముందు బట్టలు మార్చుకోవాలన్నా.. బాత్‌రూమ్ నుంచి బయటకు రావాలన్నా సిగ్గుగా అనిపిస్తుందని చాలామంది చెప్పారు.

* మొదటి రాత్రి గడిచి తెల్లారి బయటకు వస్తుండగా.. ఆడపడుచులు, ఇతర బంధువులకు ముఖం చూపించలేకపోతున్నామన్నారు.

* కడుపు ఉబ్బరంతో ఆపాన వాయువును అత్తమామల ముందు బయటకు వదల్లేక.. బాత్‌రూమ్‌కో.. వంటగదికో వెళ్లామని చెప్పినవారు కోకొల్లలు.

* ఇక చాలా మంది అమ్మాయిలైతే వేసుకున్న లోదుస్తులు అందరూ పడుకున్నాకా.. రాత్రి సమయంలో ఉతుకినట్లు తెలిపారు. చివరికి వాటిని టెర్రస్ మీద ఆరవేయడానికి టవల్‌లో దాచుకుని వెళ్లినట్లు సిగ్గు పడుతూ చెప్పారు.
 

Last Updated 9, Jul 2018, 3:24 PM IST