నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022: జాతీయ పోషకాహార వారోత్సవాల చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్..

Published : Sep 01, 2022, 10:54 AM IST
నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:  జాతీయ పోషకాహార వారోత్సవాల చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్..

సారాంశం

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:  మన దేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7  వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు. ఆహారపు అలవాట్లు, పోషణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ వారాన్ని జరుకుంటారు.   

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:   ఆరోగ్యకరమైన, పోషకాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ  పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, హెల్తీ, పోషకాహారం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఈ పోషకాహారం గురించి అందరికీ అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. 

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..  పోషకాహారంలో.. 2021 లో 116 దేశాలలో భారతదేశం 101 వ స్థానంలో ఉంది.  ఎంతో మంది చిన్న పిల్లలు పోషకాహారం లోపంలోనే చనిపోయినట్టు నివేధికలు వెల్లడించాయి. 

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022 చరిత్ర

1975లో.. అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ (ADA) గా పిలువబడే అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ సభ్యులు.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మార్చిలో  నేషనల్ న్యూట్రిషన్ వీక్ ను ప్రారంభించారు. మన జీవితంలో పోషకాహారం ఎంత ముఖ్యమైనదో తెలియజేయడమే ఈ వారానికున్న ప్రత్యేకత. 

ఈ వారోత్సవాలను జరుపుకోవడానికి  భారతదేశం కూడా ఇంట్రెస్ట్ చూపింది. దీంతో భారతదేశంలో మొదటిసారిగా 1982 లో జాతీయ పోషకాహార వారోత్సవాలను ప్రవేశపెట్టారు. పోషకాహార లోపం సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యంతో..

ఇక ఆ తర్వాత భారత ప్రభుత్వం ప్రజలలో పోషకాహార లోపాన్ని.. తక్కువ పోషకాహార లోపాన్ని తొలగించడానికి ఎన్నో కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టింది. ఇందుకోసం భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు చేసిన ప్రయత్నాల మంచి ఫలితాలను సాధించాయి. ఇవి పోషకాహార లోపం శాతాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడ్డాయి. అయినా దీనికోసం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. నేటికీ మన దేశంలో పోషకాహార లోపంతో మరణించే వారు ఎందరో ఉన్నారు. 

నేషనల్ న్యూట్రిషన్ వీక్ ప్రాముఖ్యత

 జాతీయ  పోషకాహార వారోత్సవాలకు గొప్ప ప్రాముఖ్యతే ఉంది. ఎందుకంటే ఇది పోషకాహారం ప్రాముఖ్యతను గురించి, ఇది చేసే మేలు గురించి ప్రజలకు తెలియజేస్తుంది.  ఇకపోతే సరైన పోషకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి  ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ఈ వారంలో ఎన్నో పోటీలు, కార్యక్రమాలను నిర్వహిస్తాయి. 

విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, వంటి పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఇవి ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడి.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఒక వ్యక్తి తన శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకోకపోతే అతని శరీరం బలహీనంగా మారుతుంది. దీంతో అతని శరీరం ఎన్నో వ్యాధులకు, వైరస్ లకు ఆవాసంగా మారుతుంది. 

కాబట్టి ఒక వ్యక్తి ఆరోగ్యంగా బతకాలంటే ఖచ్చితంగా తన రోజు వారి ఆహారంలో బోలెడన్నీ పోషకాలు ఉండాలి. అలాగే పోషకాహార నిపుణుడి సలహాలను పాటించాలి. 

 నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022 థీమ్: “Celebrate a World of Flavors”

PREV
click me!

Recommended Stories

బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..