గణేష్ చతుర్థి 2022: డైట్ లో ఉన్నా కూడా ఈ ప్రసాదాలు లాగించవచ్చు..!

By telugu news teamFirst Published Aug 31, 2022, 1:10 PM IST
Highlights

విఘ్న వినాయకుడికి నైవేద్యంగా ఇంట్లోనే ఎన్నో మిఠాయిలు తయారు చేసి సమర్పిస్తారు. గణేశుడి పండుగ సమయంలో కచ్చితంగా కుడుములు ఉండాలి. కుడుములు వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి గణేశ చతుర్థి నాడు ప్రతి ఒక్కరి ఇళ్లలో దీన్ని తయారుచేస్తారు.
 

గణేశ చతుర్థి వస్తే చాలు ఎక్కడ చూసినా సంబరాలు మిన్నంటుతాయి. దేశమంతా అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చౌతి రోజున జరుపుకుంటారు. ముందుగా గౌరీపూజ నిర్వహిస్తారు... తర్వాత గణపతిని పూజిస్తారు. ప్రజలు వీధులు, ఇళ్లలో వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజిస్తారు. విఘ్న వినాయకుడికి నైవేద్యంగా ఇంట్లోనే ఎన్నో మిఠాయిలు తయారు చేసి సమర్పిస్తారు. గణేశుడి పండుగ సమయంలో కచ్చితంగా కుడుములు ఉండాలి. కుడుములు వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి గణేశ చతుర్థి నాడు ప్రతి ఒక్కరి ఇళ్లలో దీన్ని తయారుచేస్తారు.

సాధారణంగా గణేశ చతుర్థి రోజున కుడుములతో పాటు నోరూరించే చాలా రకాల పదార్థాలను తయారు  చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. అయితే వీటన్నింటి కంటే కుడుములు చాలా ప్రత్యేకం. ఎందుకంటే కుడుములకు గణపయ్య ప్రీతిపాత్రుడు. అందుకే మోదక ప్రియ అని కూడా అంటారు.అయితే.. ఈ కుడుములను కాస్త మార్చి ఆరోగ్యకరంగా తయారు చేస్తే.. డైట్ లో ఉన్నవారు కూడా హాయిగా తినేయవచ్చట. 

ఈసారి గణేశ పండుగకు ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ మోదకం(కుడుములు) ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూద్దాం...

జీడిపప్పు కారామెల్, రోజ్ బటర్‌స్కోచ్ మోదక్
మీరు పాలియో  డైట్‌లో ఉన్నట్లయితే, ఈ రోజ్ బటర్‌స్కాచ్, జీడిపప్పు కారామెల్ మోడక్‌ని ప్రయత్నించండి.  పాలియో డైట్ అంటే ధాన్యాలు, పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన చక్కెరను నివారించడం. బాదం  , కొబ్బరి  వంటి సహజ స్వీటెనర్లను ఉపయోగిస్తారు.రోజ్ బటర్‌స్కోచ్ మోదక్‌లో బాదం పప్పు పౌడర్, రోజ్ వాటర్, బటర్‌స్కోచ్ ఎసెన్స్, గులాబీ రేకులు, కొబ్బరి, బాదం పాలు ఉపయోగిస్తారు. 

బాదం , పిస్తా మోదక్...
 కీటో డైట్‌లో ఉన్నవారు బాదం, పిస్తా మోదక్‌ని ఆస్వాదించవచ్చు.బాదం-పిస్తా వేరియంట్ చేయడానికి,  బాదం, పిస్తా పౌడర్‌ను సమాన మొత్తంలో ఉపయోగిస్తార. కొబ్బరి పొడి  స్వీటెనర్ గా ఉపయోగిస్తారు. తరిగిన పిస్తాపప్పులు, కుంకుమపువ్వు తో అలంకరించవచ్చు.

రా బ్రౌనీ మోదక్ 
ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో దీనిని తయారు చేయవచ్చు. అక్రోట్లు (3 టీస్పూన్లు), బాదం (3 టీస్పూన్లు), చియా గింజలు (1 టీస్పూన్), ఖర్జూరాలు (250 గ్రాములు)  కోకో పౌడర్ (1 టేబుల్ స్పూన్) తీసుకోండి. బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలను తక్కువ మంటపై కాల్చండి. వేయించిన పదార్థాలకు ఖర్జూరం, కోకో పౌడర్ జోడించండి. బాగా కలపండి. ఇప్పుడు వీటితో మోదక్ లను తయారు చేయవచ్చు. ఇవి రుచికి రుచీ అందిస్తాయి.. అదేవిధంగా  ఆరోగ్యాన్ని అందిస్తాయి. డైట్ లో ఉన్నవారు కూడా ఎలాంటి బెంగ లేకుండా తినేయవచ్చు.

click me!