
Mukesh-Nita Ambani Love Story: ముకేష్-నీతా అంబానీ ఈమధ్యే 40వ పెళ్లిరోజు వేడుక చేసుకున్నారు. వీళ్లిద్దరూ 8 మార్చి, 1985లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. కానీ మొదట్లో నీతా.. ముకేశ్ అంబానీతో అంత కంఫర్టబుల్‌గా ఫీలయ్యేవారు కాదు. కానీ 40 ఏళ్ల కింద ముంబైలో ఒక బస్సు జర్నీ వీళ్లిద్దరినీ దగ్గర చేసింది. అసలు ఆ స్టోరీ ఏందో తెలుసుకుందాం.
ముంబైలోని బిర్లా మాతోశ్రీలో నీతా ఒక కల్చరల్ ప్రోగ్రామ్‌లో పర్ఫార్మ్ చేస్తుంటే చూసిన ధీరూభాయ్, ఆయన భార్య కోకిలాబెన్ ఆమెను వాళ్ల పెద్ద కోడలిగా అనుకున్నారు. కానీ అప్పటి వరకు వాళ్ల కొడుకు ముకేశ్ నీతాని ఇష్టపడలేదు, నీతా కూడా ముకేశ్ ని ఇష్టపడలేదు. వీళ్లిద్దరినీ దగ్గర చేయడానికి నీతా వాళ్ల నాన్న ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు.
పెళ్లికి కొన్ని నెలల ముందు నీతా, ముకేశ్ ఒకరోజు కారులో ముంబైలోని పేడర్ రోడ్డు మీద వెళ్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత రోడ్డు మీద చాలా ట్రాఫిక్ ఉండటంతో ముకేశ్ తన కారుని సిగ్నల్ దగ్గర ఆపాల్సి వచ్చింది. అప్పుడే ముకేశ్ అంబానీ నీతాని ఫిల్మీ స్టైల్లో ప్రపోజ్ చేస్తూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అది విన్న నీతా సిగ్గుపడి మొహం తిప్పుకొని కారు పోనివ్వమని చెప్పింది. అప్పటికే సిగ్నల్ గ్రీన్ అవ్వడంతో వెనకాల ఉన్న కార్లు హారన్ కొట్టడం మొదలుపెట్టాయి. ముకేశ్ ‘నాకు సమాధానం వచ్చే వరకు కారు ముందుకు పోదు’ అని చెప్పారు. అప్పుడు నీతా ‘అవును’ అని సిగ్గులమొగ్గవుతూ ఒప్పుకొన్నారు.
ఆ తర్వాత నీతా కొంచెం దూరం వెళ్ళాక వెంటనే ముకేశ్ని కారు ఆపమని చెప్పారు. మీరు ఇంత రిచ్, నేను ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నిజంగా నన్ను కోరుకుంటే నాతో పాటు బెస్ట్ బస్సులో జర్నీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్లిపోయారు. అది విన్న ముకేశ్ అంబానీ సరే అని చెప్పి కారు అక్కడే వదిలేసి నీతాతో పాటు బస్సులో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ బస్సులో జుహు బీచ్‌కు వెళ్లారు. అప్పుడే నీతా నిజంగా ఇంప్రెస్ అయ్యారు. ముకేశ్ సింప్లిసిటీ చూసి నీతా అంబానీ మనసులో ఆయన మీద ప్రేమ, గౌరవం పెరిగిపోయాయి.
ముకేశ్ అంబానీ మరుసటి రోజే వాళ్ల నాన్న ధీరూభాయ్‌తో మాట్లాడి నీతాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పారు. ధీరూభాయ్, కోకిలాబెన్ అప్పటికే నీతాని కోడలిగా ఒప్పుకొన్నారు. అందుకే వాళ్లు వెంటనే నీతా వాళ్ల నాన్నతో సంబంధం గురించి మాట్లాడారు. రెండో వైపు నుంచి కూడా సమాధానం ఒకే అని వచ్చింది. తర్వాత 8 మార్చి, 1985న నీతా, ముకేశ్ అంబానీ ఎప్పటికీ ఒకటయ్యారు.