వర్షాకాలంలో మేకప్.. ఈ చిట్కాలు పాటించాల్సిందే

By telugu team  |  First Published Jul 18, 2019, 4:42 PM IST

వర్షాకాలంలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. చర్మం రంగులో కలిసిపోయే ఫౌండేషన్ ని ఎంచుకొని కొద్దిగా రాసుకోవాలి. తర్వాత కాంపాక్ట్ వాడటం మర్చిపోవద్దు. 


వర్షాకాలం మొదలైంది. చిన్నపాటి వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి. వాతావరణమంతా చల్లగా ఉంది కానీ... ఈ వర్షాకాలంలో మేకప్ వేసుకొని బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడిపోతారు. ఒక్కసారి వర్షంలో తడిస్తే.. కష్టపడి వేసుకున్న మేకపంతా పోతుంది. అంతేకాదు చాలా మంది ఈ కాలంలో ఎలాంటి మేకప్ వేసుకోవాలి అనే విషయంపై కూడా పెద్దగా క్లారిటీ ఉండదు. అలాంటివారికోసమే ఇది. ఈ కింది చిట్కాలు ఫాలో అయితే.. వర్షాకాలంలో మేకప్ సమస్య తీరుతుంది.

మేకప్ వేసుకోవడానికి ముందు ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. క్లెన్సర్ వాడటం వల్ల ముఖం మీద మిగిలిపోయిన తేమతోపాటు పేరుకున్న దుమ్ము, ధూలి లాంటివి కూడా పోతాయి. తర్వాత టోనర్ వేసుకోవాలి. టోనర్ తో ముఖం మీది చర్మ రంధ్రాలు కుంచించుకుపోతాయి. టోనర్ పీహెచ్ వాల్యూ సమం చేసి.. వర్షాకాలానికి తగ్గట్టుగా చర్మాన్ని సిద్ధం చేస్తుంది.

Latest Videos

undefined

వర్షాకాలంలో కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. ముఖం మీద మేకప్ ప్యాచులు  ప్యాచుల్లా కాకుండా నీట్ గా రావాలంటే.. మేకప్ వేసుకోవడానికి ముందు ఐస్ ముక్కతో ముకాన్ని రద్దుకోవాలి. తర్వాత మేకప్ వేసుకుంటే బాగుంటుంది.

వర్షాకాలంలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. చర్మం రంగులో కలిసిపోయే ఫౌండేషన్ ని ఎంచుకొని కొద్దిగా రాసుకోవాలి. తర్వాత కాంపాక్ట్ వాడటం మర్చిపోవద్దు.  పౌడర్ కి బదులు కాంపాక్ట్ పౌడర్ వాడితే ముఖం తాజాగా ఉంటుంది. ఇక ఇది వర్షాకాలం కాబట్టి మస్కారా, కోల్ వాటర్ ఫ్రూఫ్ వాడటం బెటర్. మేకప్ అంతా పూర్తి అయ్యింది అనుకున్న తర్వాత చివర్లో సెట్టింగ్ స్ప్రే ని వినియోగించాలి. దీని వల్ల మేకప్ ఎక్కువ సేపు చెక్కుచెదరకుండా ఉంటుంది. 

click me!