నెలసరి క్రమం తప్పిందా..?

By telugu team  |  First Published Jul 18, 2019, 2:43 PM IST

తీవ్ర ఒత్తిడి మహిళల్లో నెలసరి క్రమం తప్పడానికి ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతకాలంపాటు కంటిన్యూస్ గా ఒత్తిడిలో ఉంటే.. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అవసరమయ్యే శక్తి కోసం అండాల విడుదలను శరీరం ఆపేస్తుంది. 


స్త్రీలకు నెలనెలా పీరియడ్స్ రావడం సర్వసాధారణం. అయితే... ఒక్కోసారి వీటి క్రమం తప్పుతూ ఉంటుంది. స్త్రీలు గర్భం దాల్చినప్పుడు.. మోనోపాజ్ దశకు చేరుకునే సమయంలో ఇది క్రమం తప్పుతుంది. అయితే... అలాంటిదేమీ లేకుండా పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు అంటే మాత్రం కారణాలేంటో తెలుసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు.

తీవ్ర ఒత్తిడి మహిళల్లో నెలసరి క్రమం తప్పడానికి ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతకాలంపాటు కంటిన్యూస్ గా ఒత్తిడిలో ఉంటే.. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అవసరమయ్యే శక్తి కోసం అండాల విడుదలను శరీరం ఆపేస్తుంది.  ఏదైనా జరగకూడనిది జరిగినా... ఆడ్రినలిన్ అవసరానికి మించి స్రవించినా దాని ప్రభావం వల్ల ఈస్ట్రోజెన్, పునరుత్పత్తి హార్మోన్ల స్రావాల్లో తేడాలు వస్తాయి. దీని ఫలితం సమయానికి నెలసరి రాదు.

Latest Videos

undefined

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణమే. యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు తక్కువగా ఉండే ఆహారం, చెక్కర ఎక్కువగా ఉండే ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా పీరియడ్స్ క్రమం తప్పే అవకాశం ఉంది.

ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం కూడా నెలసరి క్రమం తప్పడానికి ఒక కారణం అవుతుందంటున్నారు నిపుణులు. బాడీ మాస్ ఇండెక్స్ 18-19 కంటే తక్కువకు పడిపోతే... శరీరంలో కొవ్వు కూడా తగ్గిపోతుంది. ఈ ప్రభావం నెలసరిపై పడుతుంది. వీటిల్లో ఏ కారణమో తెలుసుకొని వైద్యులను సంప్రదించడం మేలు. 
 

click me!